వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో దీన్ని మించిన రైలు లేదు.. గంటకు 1200కి.మీ

హైపర్ లూప్ ప్రాజెక్టులో రైలు ప్రయాణం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మార్గం ఉంటుంది. దీని ద్వారా గంటకు 1200కిమీ వేగంతో ప్రయాణించడం సాధ్యపడుతుంది.

|
Google Oneindia TeluguNews

పారిస్: అందుబాటులోకి వస్తోన్న సరికొత్త సాంకేతికతను రైల్వేలు అందిపుచ్చుకుంటున్నాయి. సరికొత్త టెక్నాలజీతో దూరభారాలను తగ్గిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందరినోటా నానుతున్న హైపర్ లూప్ రైల్వే ప్రాజెక్టు ఇప్పుడు యూరప్ లోను ప్రవేశిస్తోంది.

ప్రపంచంలో ఉన్న అన్ని రైళ్ల కన్నా.. అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత వేగవంతంగా పరుగులు పెట్టడం దీని ప్రత్యేకత. ఇప్పటిదాకా దుబాయ్, కెనడా, రష్యా వంటి దేశాల్లో హైపర్ లూప్ ప్రాజెక్టులు ప్రారంభించగా.. తాజాగా చెక్ రిపబ్లిక్ లోని బ్రునో నుంచి స్లొవెకియా రాజధాని బ్రాస్టిస్లావా వరకు హైపర్ లూప్ ప్రాజెక్టును చేపట్టేందుకు హెచ్.టీటీ(హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ టెక్నాలజీ) ఒప్పందం కుదుర్చుకుంది.

Hyperloop Is Coming To Europe Officially Picks City

ఫ్రాన్స్ లోని టౌలౌస్ కేంద్రంగా యూరప్ లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నామని హైపర్ లూప్ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, యూరోపియన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి టౌలౌస్ ప్రధాన కేంద్రంగా ఉండటంతో.. ఇక్కడి నుంచి తమ కార్యకలాపాల విస్తరణ చేపట్టాలని హెచ్.టీటీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, హైపర్ లూప్ ప్రాజెక్టులో రైలు ప్రయాణం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మార్గం ఉంటుంది. దీని ద్వారా గంటకు 1200కిమీ వేగంతో ప్రయాణించడం సాధ్యపడుతుంది. 'ది ట్రైన్ ఆఫ్ ది ఫ్యూచర్' గా పేర్కొంటున్న ఈ రైలును భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులకు నాందిగా భావిస్తున్నారు.

English summary
Hyperloop has been dubbed “The train of the future.” The project is not active at the moment Dubai, Canada and Russia, which is a futuristic pod France had to come through transport Hyperloop common technology
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X