వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను బతికే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నా: పుల్వామా దాడులను కొనియాడిన మసూద్

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ : గతకొద్దిరోజుల క్రితం జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ అనారోగ్యంతో మృతి చెందారనే వర్తా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇలాంటి పుకార్లకు చెక్ పెడుతూ తాను బతికే ఉన్నానని, క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నానని జైషే మహ్మద్ మాతృపత్రిక అల్‌ఖలామ్‌లో ఓ కాలమ్ ద్వారా తెలియజేశాడు.

ఈ నెల మొదటివారంలో మసూద్ అజార్ మృతి చెందాడంటూ వార్తలు షికారు చేశాయి. మసూద్ అజార్ లివర్ కిడ్నీలు ఫెయిల్ అవడంతో మృతి చెందాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అంతేకాదు పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ కూడా మసూద్ అజార్ మృతి చెంది ఉంటాడనే అనుమానం వ్యక్తం చేయడంతో నిజంగా మృతి చెందాడని అంతా భావించారు. సోషల్ మీడియాలో మాత్రం అజార్ మృతిపై వార్తలు హల్చల్ చేసినప్పటికీ అధికారికంగా ఎక్కడా సమాచారం బయటకు రాలేదు.

మసూద్ ఇంట్రెస్టింగ్ స్టోరీ: భారత్‌కు ఎలా వచ్చాడు...ఎక్కడున్నాడు.. ఎలా చిక్కాడు...ఎలా విడుదలయ్యాడు..? మసూద్ ఇంట్రెస్టింగ్ స్టోరీ: భారత్‌కు ఎలా వచ్చాడు...ఎక్కడున్నాడు.. ఎలా చిక్కాడు...ఎలా విడుదలయ్యాడు..?

I am alive and well: Masood Azhar writes in Jaish-e-Mohammed mouthpiece

ఇక తన మాతృపత్రిక అల్ ఖలామ్‌లో తాను మృతి చెందినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నాడు మసూద్ అజార్. పుల్వామా ఉగ్రదాడులను మసూద్ ప్రశంసించాడు. ఈ దాడుల్లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారని కశ్మీర్‌లో తమ సంస్థ బాగా పనిచేస్తోందని కొనియాడాడు మసూద్. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది అదిల్ దార్ రగల్చిన ఈ మంట చల్లారదని దీన్ని ఎవరూ ఆర్పలేరని అన్నాడు మసూద్. ఫిబ్రవరి 14న భారత కాన్వాయ్ పై ఓ కారులో పేలుడు పదార్థాలతో దూసుకెళ్లాడు అదిల్. ఆ తర్వాత భారతవైమానిక దళం బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించి శిబిరాలను ధ్వంసం చేసింది.

English summary
Jaish-e-Mohammed chief Masood Azhar penned an article in terrorist organisation's mouthpiece and said that he is in perfect health. Writing under his pen name 'Sa'adi', Masood Azhar published the write up in 'Al-Qalam', the mouthpiece of Jaish-e-Mohammed.Rumours had surfaced earlier this month about Masood Azhar's death. The rumours suggested that Masood Azhar's liver and kidneys were not functioning well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X