• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంటర్నెట్‌తో నాశనమే: మోడీపై ఒబామా ప్రశంసలు, ‘పప్పు అంటే ఇష్టం’

|
  Barack Obama Interact With Young Leaders, Watch

  న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న లీడర్‌షిప్ సదస్సులో ఆయన శుక్రవారం మాట్లాడారు. అమెరికాది అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అని, భారత్‌ది అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమని ఒబామా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే సత్తా ఇంటర్నెట్‌కు ఉందని కూడా ఒబామా హెచ్చరించారు.

  రాజ్యాంగంలో ఉన్న విలువలను ప్రతి రోజు మనం ప్రచారం చేయాలని, భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. కేవలం ఆసియాలోనే మాత్రమే కాకుండా, విశ్వవ్యాప్తంగా భారత్ తన పాత్రను పోషించాలని ఒబామా సూచించారు. మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని, పేద-ధనికుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

   మోడీ విశేష కృషి.. పరిష్కారం కాని సమస్య ఉండదు

  మోడీ విశేష కృషి.. పరిష్కారం కాని సమస్య ఉండదు

  పారిస్ వాతావరణ ఒప్పందం కోసం తాను, ప్రధాని మోడీ విశేషంగా కృషి చేసినట్లు చెప్పారు. ఇటీవల మీడియా పాత్ర ఎక్కువైన విషయాన్ని తెలియజేస్తూ.. నిజమైన వార్తలను గుర్తించాలని, కొత్త సమాచార యుగం అవసరమన్నారు. భారత్, అమెరికాలు కలిసి పనిచేస్తే.. ప్రపంచంలో పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదని ఒబామా అన్నారు.

   మోడీకి ప్రజల మద్దతు ఇస్తేనే..

  మోడీకి ప్రజల మద్దతు ఇస్తేనే..

  అంతర్జాతీయంగా ప్రజల్లో అభద్రతాభావం ఉందని, దాన్ని తొలిగిస్తేనే మానవ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఐక్యత కోసం పనిచేస్తున్నారని, కానీ ప్రజలు మద్దతు ఇస్తేనే నవ సమాజం ఏర్పడుతుందని ఒబామా అన్నారు. న్యూక్లియర్ సప్లె గ్రూప్‌లో భారత్‌ను చేర్చాలని తాము ప్రయత్నించామని, కానీ కొన్ని దేశాలు అడ్డుకుంటున్నట్లు పాకిస్థాన్, చైనాలను ఉద్దేశిస్తూ ఆయన తెలిపారు.

   మోడీ అంటే ఇష్టం.. మన్మోహన్ అంటే..

  మోడీ అంటే ఇష్టం.. మన్మోహన్ అంటే..

  ఉగ్రవాద చర్యలు ఎవరినైనా ఇబ్బందిపెడుతాయని ఒబామా అన్నారు. ముంబై దాడుల తర్వాత తాము ఆ విధంగా ఆలోచన చేశామన్నారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తాను ఇష్టపడుతానని, అతను దేశాభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్నారని, మాజీ ప్రధాని మన్మోహన్ అన్నా తనకు అభిమానమని ఒబామా చెప్పారు.

   పప్పు అంటే ఇష్టం.. తొలి అమెరికా అధ్యక్షుడిని

  పప్పు అంటే ఇష్టం.. తొలి అమెరికా అధ్యక్షుడిని

  భారతీయ ముఖ్య వంటకమైన ‘పప్పు'ను ఇష్టంగా ఆరగించిన తొలి అమెరికా అధ్యక్షుడిని తానేనని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. విద్యార్థి దశలో తనకు ఓ భారతీయ విద్యార్థి రూమ్మెట్‌గా ఉన్నాడని, ఆ సమయంలో పప్పు వంటకాన్ని చేయడం కూడా నేర్చుకున్నానని తెలిపారు. కీమా, చికెన్ కూడా తాను బాగా చేస్తానని వ్యాఖ్యానించారు. అయితే, తనకు చపాతీ చేయడం రాదని అన్నారు.

  English summary
  Former US president Barack Obama had the audience here in splits when he said that he was the first American president to have a recipe for daal, the humble Indian dish which is staple in many Indian households.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X