వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను రాజకీయ నేతను కాను, ఒబామాకేర్ ను తక్షణమే రద్దు చేస్తా: ట్రంప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందుంటాడు.తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే వినాశకరమైన ఒబామా హెల్త్ కేర్ ను రద్దు చేస్తానని ప్రకటించారు.అంతేకాదు తాను రాజకీయనాయకుడిని కాదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తోన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

నవంబర్ 8వ, తేదిన అమెరికాలో ఎన్నికలు జరుగనున్నాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.తనను ఆదరించిన దేశం రుణం తీర్చుకోవడానికే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ఆయన చెప్పారు

trump

తాను దేశాక్షుడు కాగానే వినాశకరమైన ఒబామా కేర్ ను తక్షణమే రద్దు చేస్తానని ప్రకటించారు.ఆరోగ్య సంరక్షణపై చర్చ సందర్భంగా ట్రంప్ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య సంరక్షణ ఘొరంగా ఉందని ఆయన ఆరోపించారు. తాను దేశాక్షుడు కాగానే ఒబామా హెల్త్ కేర్ ను రద్దు చేసేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ను కోరనున్నట్టు చెప్పారు. ఒబామా కేర్ ను విస్తరించాలని హిల్లరీ కోరుకొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను ఆదరిస్తోన్న దేశం రుణం తీర్చుకొనేందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు చెప్పారు. తాను రాజకీయనాయకుడిని కాదన్నారు. తనకు అమెరికన్లు అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉందన్నారు. వాషింగ్టన్ లోని రాజకీయవర్గం తమ గురించే చూసుకొంటుందని ఆయన ఆరోపించారు.ప్రజలను ఫణంగా పెట్టి వాళ్ళు అధికారాన్ని అంటిపెట్టుకొంటారని ఆయన దుయ్యబట్టారు.

English summary
iam not a political leader said american president candidate of republican party candidate.if he will elect american president very next minute ban the obama healthcare said trump.he conduct a election meeting at pensilveniya .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X