వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుంగ్ ఫూ కాదు..కుంగ్ ఫ్లూ: చైనాపై విరుచుకుపడ్డ ట్రంప్: అధ్యక్షుడి ఎన్నికల ప్రచారానికి బోణి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. పదునైన విమర్శలు, ఘాటు ఆరోపణలు, సెటైర్లతో డ్రాగన్ కంట్రీపై చెలరేగిపోయారు. కరోనా వైరస్‌కు చైనా పుట్టినిల్లుగా మారిందంటూ పరోక్షంగా ఆరోపణలను గుప్పించారు. చైనా.. కుంగ్‌ఫూనకు మాత్రమే కాదు.. కుంగ్ ఫ్లూనకు కూడా కేరాఫ్‌గా నిలిచిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. పైగా తమ పొరుగు దేశంపై కయ్యానికి కాలు దువ్వుతోందని ధ్వజమెత్తారు.

అమెరికా అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించిన మొట్టమొదటి ఎన్నికల ప్రచార ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఓక్లహామాలోని టుల్సాలో ఈ ఎన్నికల ప్రచార ర్యాలీని ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో అందరి దృష్టీ దాని మీదే నిలిచింది. ఎలాంటి ప్రాధాన్యత అంశాలను ప్రస్తావిస్తారనే విషయంపై ఫోకస్ పెట్టారు అమెరికన్లు.

దానికి అనుగుణంగానే ట్రంప్ ప్రసంగించారు. ప్రాణాంతక కరోనా వైరస్ అమెరికన్లకు పెను సవాల్‌ను విసిరిన నేపథ్యంలో.. అదే అంశాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. వైరస్ పుట్టుకకు కారణమౌనట్టుగా అనుమానిస్తోన్న చైనాపై నిప్పులు చెరిగారు. కరోనా వైరస్‌కు కొత్త పేరు పెట్టారు. ఆ వైరస్‌ను ఇకపై తాను కుంగ్ ఫ్లూగా పిలుస్తానని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫూ తరహాలోనే కుంగ్ ఫ్లూను చైనా పుట్టించిందని ఎద్దేవా చేశారు.

I can name - Kung flu: US President Trump again blames China for coronavirus

కరోనా వైరస్‌కు ఒకటి కాదు.. రెండు కాదు.. 19 రకాల పేర్లతో పిలవొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. చాలామంది కరోనాను వైరస్‌గా పిలుస్తున్నారని, కొందరు ఫ్లూగా అభివర్ణిస్తున్నారని చైనాను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. వైరస్ అయినా, ఫ్లూ అయినా పెద్దగా తేడా ఏమీ లేదని అన్నారు. ఇలా 19 నుంచి 20 రకాల పేర్లతో కరోనాను పిలుచుకోవచ్చని సెటైర్లు సంధించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చైనా తమ పొరుగు దేశంపై సరిహద్దు వివాదాలను సృష్టించుకుందని అన్నారు.

Recommended Video

#IndiaChinaFaceOff : India-China మధ్య ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన Donald Trump || Oneindia

భారత్‌ను చైనా పొరుగుదేశంగా ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. భారత్‌తో ఉన్న సరిహద్దు వివాదాలను ఘర్షణలుగా మార్చుకుందని పరోక్షంగా విమర్శించారు. కరోనా వైరస్ వల్ల తన దేశంలో ఎంతమంది మరణించారో.. ఎంతమంది ఆసుపత్రుల పాలయ్యారో ప్రపంచం మొత్తానికీ తెలుసునని అన్నారు. అమెరికాలో కరోనా వైరస్ వల్ల 1,19,000 మందికి పైగా మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అనేక దేశాలు దీని బారిన పడ్డాయని చెప్పారు.

English summary
Trump, addressing his first election rally on Saturday in Tulsa, Oklahoma, after the outbreak of the coronavirus pandemic in the US early this year, said that the COVID-19 is a disease and has many names than any disease in history. "“I can name – Kung flu. I can name 19 different versions of names. Many calls it a virus, which it is. Many calls it a flu. What difference. I think we have 19 or 20 versions of the name," Trump said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X