వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''ప్లీజ్‌.. తెలియక చేరా.. సారీ చెబుతున్నా.. వదిలేస్తే ఇంటికెళ్తా..''

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరిన ఓ జర్మనీ యువతి ఇప్పుడు పశ్చాత్తపం వ్యక్తం చేస్తోంది. తెలియక ఈ సంస్థలో చేరానని, వదిలేస్తే తన ఇంటికెళ్తానంటూ ఇరాక్ లో బందీగా పట్టుబడి ఓ కారాగారంలో ఉన్న ఈమె విజ్ఞ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెర్లిన్‌: చేతులు కాలాక ఆకులుపట్టుకున్నట్లు.. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరిన ఓ జర్మనీ యువతి ఇప్పుడు పశ్చాత్తపం వ్యక్తం చేస్తోంది. తెలియక ఈ సంస్థలో చేరానని, తప్పైపోయిందంటూ కన్నీటి పర్యంతమవుతోంది.

2016లో జర్మనీకి చెందిన నలుగురు యువతులు ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరారు. వీరిలో ఓ 16 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆమె పేరు లిండ్ వెంజెల్. ప్రస్తుతం ఇరాక్‌ బలగాల అదుపులోకి వెళ్లి జైలులో ఉన్న లిండా తీవ్రంగా రోదిస్తోంది.

'I Just Want To Go Home', Says German Girl Who Joined ISIS'

తాను చేసిన తప్పుకు క్షమాపణలు చెబుతున్నానని, తాను తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పుడు తనకు ఉన్న ఏకైక కోరిక అది మాత్రమే అని వెల్లడించింది.

ప్రస్తుతం జర్మనీ విదేశాంగ కార్యాలయం ఈమకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టింది. ఈమె కేసును టేకప్‌ చేసిన న్యాయవాది లోరెంజ్‌ హాసే మాట్లాడుతూ.. ఇరాక్‌లో గుర్తించిన లిండా వెంజెల్ కు ప్రస్తుతం కొంత సహాయం అందుతోందని చెప్పారు.

అయితే, ఆమె ప్రస్తుత పరిస్థితి ఏమిటో ఇంకా తనకు కూడా స్పష్టంగా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. 'ఈ యుద్ధరంగం నుంచి, ఈ శబ్ధాల నుంచి నన్ను దూరంగా తీసుకెళ్లండి. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను నా ఇంటికి చేర్చండి..' అని లిండా చెప్పినట్లు డేర్‌ స్పైజెల్‌ అనే పత్రిక తన కథనంలో పేర్కొంది.

English summary
A German teenager who joined ISIS is now being held in detention in Iraq and says she regrets joining the terrorist group and just wants to come home to her family, media reported on Sunday. Der Spiegel magazine reported on Saturday that four German women who joined ISIS in recent years, including a 16-year-old girl from the small town of Pulsnitz near Dresden, are being held in an Iraqi prison and receiving consular assistance. "I just want to get away from here," she was quoted as saying. "I want to get away from the war, from the many weapons, from the noise." She added: "I just want to go home to my family."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X