వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బౌద్ధ మత గురువులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న సంగతి 1990లోనే తెలుసు: దలైలామా

|
Google Oneindia TeluguNews

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌద్ధమతానికి చెందిన గురువులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న విషయం తనకు తెలుసనని దలైలామా చెప్పారు. అది ఈనాడు కొత్తగా వచ్చింది కాదని 1990వ దశకం నుంచే ఇలాంటి వ్యవహారాల గురించి తనకు తెలుసునని చెప్పారు దలైలామా. టిబెట్‌కు చెందిన ఈ ఆధ్యాత్మిక గురువు నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ బౌద్ధ గురువులచే లైంగిక వేధింపులకు గురైన బాధితులను ఆయన కలిశారు. కలిసిన సందర్భంగా పైవ్యాఖ్యలు చేశారు దలైలామా.

క్షమాపణలు చెప్పిన దలైలామాక్షమాపణలు చెప్పిన దలైలామా

బౌద్ధగురువుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన తమకు దలైలామాను కలిసి తమ బాధను చెప్పుకునేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతూ బాధితులు పిటిషన్ పెట్టుకున్నారు. ఎలాగూ దలైలామా యూరప్‌లో పర్యటిస్తున్నారు కాబట్టి ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వాల్సిందిగా వారు పిటిషన్‌లో తెలిపారు. బౌద్ద మతం అంటే ఎంతో గౌరవం ఉందని తాము అనుకున్నామని కానీ ఇందులో కూడా బౌద్ద మతం పేరుతో అత్యాచారం, లైంగిక వేధింపులు జరుగుతుండటం చాలా బాధాకరం అని పిటిషన్‌లో బాధితులు తెలిపారు. డచ్ టెలివిజన్‌లో మాట్లాడిన దలైలామా తనకు ఈ విషయాలు ఎప్పుడో తెలుసని చెప్పారు.

I Knew of Sex Abuse by Buddhist Teachers:DalaiLama

25 ఏళ్ల కిత్రం ధర్మశాలలో పాశ్చాత్య దేశం నుంచి బౌద్ధమతం గురించి తెలుసుకునేందుకు వచ్చిన వారిపై కొందరు బౌద్ధ మత గురువులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ సందర్భంగా దలైలామా గుర్తు చేశారు. లైంగిక వేధింపుల ఆలోచన కలిగిన వ్యక్తులకు బౌద్ధమతం అంటే గౌరవం లేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇది బహిరంగం కావడంతో ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడిన వారు సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు దలైలామా. నవంబర్‌లో టిబెట్‌కు చెందిన బౌద్ద మత గురువులు ధర్మశాలలో సమావేశమవుతున్నారని ... ఆ సమయంలో లైంగిక వేధింపులపై చర్చించాలని దలైలామా అన్నారు. మతగురువులు దీనిపై మరింత దృష్టి సారించి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు.

English summary
The Dalai Lama said on Saturday that he has known about sexual abuse by Buddhist teachers since the 1990s and that such allegations are "nothing new".The Tibetan spiritual leader, revered by millions of Buddhists around the world, made the admission during a four-day visit to the Netherlands, where he met on Friday with victims of sexual abuse allegedly committed by Buddhist teachers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X