వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మీరంటే ఇష్టం, ముంబై రావాలని ఉంది: ఇజ్రాయెల్‌లో 11 ఏళ్ల మోషె

'మీరంటే నాకు ఇష్టం, మళ్లీ ముంబై రావాలని ఉంది' అని ప్రధాని నరేంద్ర మోడీతో పదకొండేళ్ల చిన్నారి మోషె అన్నారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

జెరూసలేం: 'మీరంటే నాకు ఇష్టం, మళ్లీ ముంబై రావాలని ఉంది' అని ప్రధాని నరేంద్ర మోడీతో పదకొండేళ్ల చిన్నారి మోషె అన్నారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: ఇజ్రాయెల్‌లో అరుదైన గౌరవం, ఓ పువ్వుకు 'మోడీ' పేరు, ఇదే ఆ ఫ్లవర్...

2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన మోషె తల్లిదండ్రులు మృతి చెందారు. మోషెను శాండ్రా శామ్యూల్స్ కాపాడారు. అప్పటికి ఆ బాలుడి వయస్సు రెండేళ్లు. ఇప్పుడు 11 ఏళ్లు ఉన్నాడు.

మోషె ప్రధాని మోడీని ఇజ్రాయెల్‌లో కలిశారు. బాలుడితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మోషె తాను రాసి తెచ్చుకున్న ప్రసంగాన్ని చదివి వినిపించాడు.

I love you, 26/11 survivor Baby Moshe tells Modi

తనకు మళ్లీ ముంబై రావాలని ఉందని మోడీతో అన్నాడు. మోడీకి మోషె ఓ చిత్రాన్ని బహూకరించాడు. మోషె కుటుంబ సభ్యులతో మోడీ ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ ఉన్నారు.

చదవండి: 70 ఏళ్లుగా ఇజ్రాయెల్ వెయిటింగ్, మోడీ అడుగు: చైనా దూకుడు ఎఫెక్ట్..

ఇరువురు ప్రధానమంత్రులు మోషె మాట్లాడుతున్నంత సేపు ఆసక్తిగా విన్నారు. అభినందించారు. మోషె భుజంపై చేయి వేసి మోడీ అభినందించారు. నేతన్యాహూ చప్పట్లు కొట్టారు. మోడీ.. మోషెను కుటుంబంతో సహా భారత్‌కు ఆహ్వానించారు.

తనకు భారత్ మళ్లీ రావాలని ఉందని మోషె చెప్పాడు. డియర్ మోడీ మీరంటే నాకు అభిమానం, మీ ప్రజలు (భారతీయులు) అంటే చాలా ఇష్టమని చెప్పాడు. నా తల్లిదండ్రులు ఎప్పుడూ గుర్తు చేసుకుంటానని చెప్పాడు. త్వరలో ముంబై వస్తానేమో అన్నాడు.

English summary
The much awaited meeting has taken place. Prime Minister of India, Narendra Modi met with Baby Moshe in Israel. Modi was greeted in Hindi by Moshe Holtzberg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X