వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను దేవతను కాదు, కాలేను కూడా: పాకిస్తాన్ యువతికి సుష్మా స్వరాజ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఆరోగ్య సమస్యల దృష్ట్యా భారత్ వచ్చేందుకు వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎప్పుడూ చేయూతనిస్తూ, అందరి ఆదరణ చూరగొంటున్నారు. ముఖ్యంగా పాకిస్తానీలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆమెను ఆత్మబంధువుగా పలువురు పేర్కొంటున్నారు. ట్విట్టర్‌లో వీసా కోసం అడిగిన వెంటనే అధికారులను ఆదేశిస్తూ, వారికి ఊరట కలిగిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ యువతి తన తండ్రి కోసం వీసా జారీ చేయాలని కోరారు.

I'm No Messiah, Sushma Swaraj Tells Pak Woman Requesting Visa For Father

పాక్‌కు చెందిన షెహాబ్ అనే యువతి తన తండ్రి కాలేయ సర్జరీ కోసం వీసా కావాలని కోరింది. సుష్మాను ఇబ్నే ఇ మరియం అని పోల్చింది. అంటే మేరీ కుమారుడు ఏసుతో పోల్చింది.

ఈ ట్వీట్‌కు సుష్మ స్పందిస్తూ తాను దేవుడినికాదని, కాలేనని, నీ బాధ నాకు అర్థమైందని పేర్కొన్నారు. రబియా తండ్రికి వీసా కూడా జారీ చేశారు.

మరో ట్వీట్‌లో ఫాతిమా అనే మహిళ తన భర్త కోసం వీసా కోసం చేతులు జోడిస్తూ వేడుకుంటున్నానని పేర్కొన్నారు. దానికి సుష్మా వేడుకోవాల్సిన అవసరం లేదని, సమస్య చెప్పండి చాలు అని సమాధానం ఇచ్చారు.

English summary
External Affairs Minister Sushma Swaraj is known for accepting several requests for medical visas for Pakistani citizens through Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X