వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంతలా ఊహించలేదు: యోగా డేపై బాన్ కీ మూన్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రపంచ యోగా దినోత్సవానికి వివిధ దేశాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందన పట్ల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఆనందం వ్యక్తం చేశారు. 192 దేశాల్లో 200 కోట్ల మంది యోగా దినోత్సవాన్ని నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.

ఇదంతా భారత్ గొప్పదనమేనని బాన్ కీ మూన్ అభినందించారు. ఇందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఐరాసలో నిర్వహించే యోగా దినోత్సవంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్వా స్వరాజ్, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్' గురు రవిశంకర్ పాల్గొన్నారు.

 'I'm very excited': What UN secretary general Ban Ki-moon told Sushma Swaraj about Yoga Day

న్యూయార్క్‌లో వారు బాన్ కీ మూన్‌ని కలిశారు. ఈ సందర్భంగా బాన్ కీ మూన్ తన స్పందనను సుష్మా స్వరాజ్‌కు తెలియజేశారు. ‘నమస్తే క్యా హల్ చల్ హే' అని ఆమెను పలకరించారు. ఎన్నో అంతర్జాతీయ దినోత్సవాలను చూశాం.. కానీ, యోగా దినోత్సవం అపూర్వమైన అనుభూతికి గురిచేసిందని చెప్పారు.

తాను నిరుడు జనవరిలో భారతదేశానికి వచ్చినప్పుడు చాలా బాగా గౌరవ మర్యాదలు చేశారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మేలో సియోల్ జరిగిన ఓ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం మళ్లీ వచ్చిందని తెలిపారు.

English summary
UN secretary general Ban Ki-moon has expressed his excitement at the first International Day of Yoga during his meeting with external affairs minister Sushma Swaraj, saying the day has garnered "unprecedented" enthusiasm from people around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X