• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అబ్బో! భారత్‌లో నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా?: మార్ఫింగ్ ఫొటోలపై ఇవాంకా ట్రంప్.. !

|

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా.. అందరి కళ్లూ ఆయన కుమార్తె ఇవాంకా మీదే నిలిచాయనడంలో సందేహాలు అక్కర్లేదు. ఆమె తల నుంచి పాదాల దాకా ధరించిన దుస్తులు, పాదరక్షల వరకూ నెట్టింట్లో జోరుగా చర్చ కొనసాగింది. ఈ విషయంలో ట్రంప్ భార్య మెలానియానూ వదిలి పెట్టలేదు నెటిజన్లు. మెలానియా, ఇవాంక ట్రంప్‌ల టూర్ గురించి పెద్ద చర్చే నడిచింది.. నెట్ నట్టింట్లో.

ఆరుమందిని పొట్టన పెట్టుకున్న అతివేగం: కాలువలోకి పల్టీ కొట్టిన తుఫాన్ఆరుమందిని పొట్టన పెట్టుకున్న అతివేగం: కాలువలోకి పల్టీ కొట్టిన తుఫాన్

నానా విధములుగా ఇవాంకా ఫొటోలు..

నానా విధములుగా ఇవాంకా ఫొటోలు..

డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు తిరుగుముఖం పట్టిన తరువాత.. ఇవాంకా ట్రంప్‌కు చెందిన ఓ ఫొటో సోషల్ మీడియాలో భలేగా హల్‌చల్ చేసింది. తాజ్‌మహల్ వద్ద ఆమె దిగిన ఓ ఫొటోను మనోళ్లు పరిపరి విధములుగా వాడేశారు. ఆమె ఫొటోపై పలు ప్రయోగాలు చేశారు. ఒకడేమో ఇవాంకా ట్రంప్‌ను సైకిల్‌పై తిప్పుతున్నట్టు.. మరొకడేమో ఆమె భుజంపై చేతులు వేసి మరీ తాజ్‌మహల్ వద్ద ఫొటో దిగినట్టు.. ఎడ్లబండి మీద ఎక్కించుకున్నట్లు ఇంకొకడు.. ఇలాంటి ఫొటోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

దిల్జీత్ దోసాన్జీ కూడా..

దిల్జీత్ దోసాన్జీ కూడా..

ప్రముఖ బాలీవుడ్ యాక్టర్, ప్లేబ్యాక్ సింగర్ దిల్జీత్ దోసాన్జీ కూడా వారికి మినహాయింపేమీ కాదు. ఆయన కూడా ఇవాంకా ఫొటోను మార్ఫ్ చేశారు. ఆమె కాలి మీద తన కాలు వేసి బేఫికర్‌గా కూర్చునట్టు ఫోజులిస్తూ మార్ఫింగ్ చేశారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలన్నీ కూడా ఇవాంకా దృష్టికి చేరాయి.. అదే సోషల్ మీడియా ద్వారా. ఈ మార్ఫింగ్ ఫొటోలన్నింటినీ ఇవాంకా ట్రంప్‌కు హ్యాష్‌ ట్యాగ్ చేశారు.

స్పోర్టివ్‌గా తీసుకున్న ఇవాంకా.. ట్వీట్

స్పోర్టివ్‌గా తీసుకున్న ఇవాంకా.. ట్వీట్

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడిగా పేరున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తెపై ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలు రావడం పట్ల మరొకరైతే ఎలా రియాక్ట్ అయ్యేవారో తెలియదు గానీ.. ఇవాంకా మాత్రం లైట్‌గా తీసుకున్నారు. స్పోర్టివ్‌గా స్పందించారు. తన స్పోర్టివ్‌నెస్‌ను ఆమె ప్రదర్శించారు. మనోళ్ల టాలెంట్‌ను ప్రశంసించడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. తనకు భారత్‌లో చాలామంది స్నేహితులు పుట్టుకొచ్చారని మెచ్చుకున్నారు.

దిల్జీత్ మనసును దోచిన ఇవాంకా..

దిల్జీత్ మనసును దోచిన ఇవాంకా..

దిల్జీత్ దోసాన్జీ సైతం ఇవాంకా ట్రంప్ ఫొటోలను మార్ఫింగ్ చేయడం ట్విస్ట్. ఆమెను కలిసి తాను ఫొటో దిగలేకపోయాననే ఆవేదన తనను కలచి వేస్తోందని చెప్పుకొచ్చిన దిల్జీత్.. మార్ఫింగ్ ఫొటో ద్వారా తన ఆవేదన తీరిందని చెప్పుకొచ్చారు. ఇవాంకా ట్రంప్‌ దిగిన ఫొటో పక్కన తాను కూర్చునట్టుగా మార్ఫింగ్ చేశారు. దాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో కూడా ఇవాంకా కంట్లో పడింది. తనకు తాజ్‌మహల్‌ను చూపించినందుకు థ్యాంక్స్ అంటూ ఆమె దిల్జీత్‌కు రీట్వీట్ చేశారు.

English summary
I made many new friends, says Ivanka Trump on her morphing photos. She said on her Twitter on Sunday told that I appreciate the warmth of the Indian people and I made many new friends. Actor and singer Diljit Dosanjh’s love for famous ladies is still going strong. In a new Instagram post, Diljit showed his fans a glimpse into his trip to Taj Mahal with Ivanka Trump and told them how she was after his life to take her out. Even Ivanka decided to get in on the fun, becoming the first one of those famous ladies to actually reply to his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X