వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట మార్చిన ట్రంప్.. పాక్‌‌పై నమ్మకం ఉంది.. కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భారత్-పాకిస్తాన్ మధ్య దశాబ్దాల కాలం నుంచీ నలుగుతూ వస్తోన్న జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాశ్మీర్ వివాదానికి చరమగీతం పలకడానికి తాను సిద్ధమని ఆయన వెల్లడించారు. దీనికి రెండు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. పాకిస్తాన్ పై తన పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. భారత్, పాకిస్తాన్ ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, ఇమ్రాన్ ఖాన్ అంగీకరిస్తే.. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి తాను స్వయంగా మధ్యవర్తిత్వం వహిస్తానని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ తో సమావేశం అనంతరం ఏర్పాటైన విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ సానుకూల ప్రకటన చేయడం ఇది మూడోసారి.

మరోసారి వార్తల్లోకి ఎక్కిన వనజాక్షిమరోసారి వార్తల్లోకి ఎక్కిన వనజాక్షి

పాకిస్తాన్ పై అపార విశ్వాసం

పాకిస్తాన్ పై అపార విశ్వాసం

ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని మట్టు బెట్టడానికి తాను అందిరి కంటే ముందు ఉంటానని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. 24 గంటలు కూడా గడవక ముందే పాకిస్తాన్ పై విశ్వాసాన్ని ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అణచి వేయాల్సిందేనని, దీని కోసం ఎలాంటి సహాయాన్నయినా అందించడానికి సిద్ధంగా ఉన్నానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హ్యూస్టన్ లో ఏర్పాటైన హౌడీ మోడీ సదస్సుకు హాజరైన ట్రంప్.. నరేంద్ర మోడీ సమక్షంలోనే ఈ ప్రకటన చేయడంతో ఇక అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చినట్లు అందరూ భావించారు. సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే.. ట్రంప్ నుంచి విరుద్ధ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్ పై తనకు అపారమైన విశ్వాసం ఉందని, కాశ్మీర్ పై మధ్యవర్తిత్వాన్ని వహించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు.

మోదీ సమక్షంలోనే

మోదీ సమక్షంలోనే

హ్యూస్టన్ లో ఏర్పాటైన హౌడీ మోడీ సదస్సుకు హాజరైన ట్రంప్.. నరేంద్ర మోడీ సమక్షంలోనే ఈ ప్రకటన చేయడంతో ఇక అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చినట్లు అందరూ భావించారు. సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే.. ట్రంప్ నుంచి విరుద్ధ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్ పై తనకు అపారమైన విశ్వాసం ఉందని, కాశ్మీర్ పై మధ్యవర్తిత్వాన్ని వహించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు.

 మోడీ, ఇమ్రాన్ లతో సన్నిహిత సంబంధాలు..

మోడీ, ఇమ్రాన్ లతో సన్నిహిత సంబంధాలు..

నరేంద్ర మోడీ, ఇమ్రాన్ ఖాన్ లతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తన మధ్యవర్తిత్వానికి వారిద్దరి వైపు నుంచి అభ్యంతరాలు ఉండకపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో పాకిస్తాన్ పై కూడా తనకు నమ్మకం ఉందని, కాశ్మీర్ వివాదానికి సామరస్యమైన ముగింపును పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ సానుకూలంగా స్పందించడం చర్చనీయాంశమైంది. డొనాల్డ్ ట్రంప్ ఓ మంచి మధ్యవర్తి.. అంటూ ఆయన అప్పటికప్పుడు తన స్పందనను తెలియజేశారు. దీనిపై తన మంత్రివర్గంలో చర్చించాల్సి ఉందని, ఆ తరువాతే ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకుంటానని అన్నారు.

కాశ్మీర్ వివాదంపై అమెరికా మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ముందుకు రావడంపై కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా ఆసక్తిగా లేదు. దీనిపై ఇదివరకే కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసలు

డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసలు

డొనాల్డ్ ట్రంప్ ఓ మంచి మధ్యవర్తి.. అంటూ ఆయన అప్పటికప్పుడు తన స్పందనను ఇమ్రాన్ ఖాన్ తెలియజేశారు. దీనిపై తన మంత్రివర్గంలో చర్చించాల్సి ఉందని, ఆ తరువాతే ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకుంటానని అన్నారు. కాశ్మీర్ వివాదంపై అమెరికా మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ముందుకు రావడంపై కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా ఆసక్తిగా లేదు. దీనిపై ఇదివరకే కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

భారత్ వైఖరేంటీ?

భారత్ వైఖరేంటీ?

కాశ్మీర్ అంశాన్ని వివాదాస్పదంగా పరిగణించట్లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఇదివరకే తేటతెల్లం చేసింది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, దానిపై ఎలాంటి మధ్యవర్తిత్వానికి గానీ, చర్చలకు గానీ అవకాశమే లేదని అన్నారు. మధ్యవర్తిత్వం పేరుతో అమెరికా ఈ అంశంలో జోక్యం చేసుకోవడాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పు పట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. అత్యంత సున్నితమైన కాశ్మీర్ విషయంలో థర్డ్ పార్టీ నుంచి సహకారాన్ని తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని కేంద్రం వెల్లడించింది. అమెరికా సహా ఏ దేశమైనా సరే.. జమ్మూ కాశ్మీర్ వివాదానికి పరిష్కరించడానికి ముందుకు వస్తామంటూ చేసే ప్రకటనలకు తాము పెద్దగా ప్రాధాన్యత ఇవ్వబోమని కుండబద్దలు కొట్టింది.

కేంద్రం భిన్న వైఖరి

కేంద్రం భిన్న వైఖరి

అత్యంత సున్నితమైన కాశ్మీర్ విషయంలో థర్డ్ పార్టీ నుంచి సహకారాన్ని తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని కేంద్రం వెల్లడించింది. అమెరికా సహా ఏ దేశమైనా సరే.. జమ్మూ కాశ్మీర్ వివాదానికి పరిష్కరించడానికి ముందుకు వస్తామంటూ చేసే ప్రకటనలకు తాము పెద్దగా ప్రాధాన్యత ఇవ్వబోమని కుండబద్దలు కొట్టింది.

English summary
At the beginning of Monday's meeting with Imran Khan, President Trump said if both Mr Khan and PM Modi wanted him to mediate an agreement between them on Kashmir, he was "ready, willing and able". "I trust Pakistan... Want to see everyone treated well in Kashmir... I have a very good relation with Prime Minister Modi. I have a very good relationship with Prime Minister Khan. If they both say 'we have a point to iron out', I will be ready to do it," he told reporters, Imran Khan at his side . "I think I'd be an extremely good arbitrator," he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X