వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా దారులు మూసుకుపోయినట్టే: ఇమిగ్రేషన్లను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్: పెద్ద కథే

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతోంది అగ్రరాజ్యం అమెరికా. ఏ దేశంలోనూ లేనంత పెను ప్రభావాన్ని అమెరికాపై చూపిస్తోంది ఈ వైరస్. మరే దేశంలోనూ లేనన్ని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు అమెరికాలో నమోదవుతున్నాయి. గంటగంటకూ పదుల సంఖ్యలో అమెరికన్లు ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికన్ ఇమిగ్రేషన్లను రద్దు చేశారు. ఇది తాత్కాలికమేనని.

కనిపించని శతృవుతో పోరాటం..

కనిపించని శతృవుతో పోరాటం..

అమెరికన్ ఇమిగ్రేషన్లను రద్దు చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇమిగ్రేషన్‌ను రద్దు చేయడానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఇప్పుడే సంతకం చేశానని తెలిపారు. కంటికి కనిపించని శత‌ృవు దాడి చేస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే తాను ఈ సంతకం చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తమ దేశ యువత ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే తాత్కాలికంగా ఇమిగ్రేషన్లను రద్దు చేసినట్లు ట్రంప్ చెప్పారు.

42 వేలను దాటిన కరోనా మృతులు

42 వేలను దాటిన కరోనా మృతులు

అమెరికాలో కరోనా వైరస్‌కు బలైన వారి సంఖ్య 42 వేలను దాటిపోయింది. 42,514 మంది కరోనా వైరస్ వల్ల మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరువ అవుతోంది. 7,92,759 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అక్కడ నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమెరికాలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీనివల్ల సుమారు రెండున్నర కోట్లమందికి పైగా అమెరికన్లు ఉపాధిని కోల్పోయారు.

ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత..

పరిస్థితులు కుదుటపడిన తరువాత పునఃప్రారంభమయ్యే ఉద్యోగాల నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీనిపై ఇప్పటికే ఆ దేశంలో చర్చలు ఆరంభం అయ్యాయి. అమెరికన్లకు ఉపాధిని కల్పించడానికి ఇమిగ్రేషన్లను నియంత్రించాల్సి అవసరం ఉంటుందని భావించిన అధికారులు దాన్ని తక్షణమే కార్యారూపంలోకి తీసుకొచ్చారు. అమెరికా ఇమిగ్రేషన్లను రద్దు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను రూపొందించారు. దీనిపై ట్రంప్ సంతకం చేశారు. ఇమిగ్రేషన్లను రద్దు చేస్తూ రూపొందించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినట్లు ఆయన వెల్లడించారు.

Recommended Video

Donald Trump Warns China | వూహాన్‌పై దాడికి ట్రంప్ సంకేతాలు

English summary
Amecica President Donald Trump on Monday said he will sign an executive order to temporarily suspend immigration into the United States amid the coronavirus pandemic, a move that is likely to draw prompt legal challenges. "In light of the attack from the Invisible Enemy, as well as the need to protect the jobs of our GREAT American Citizens, I will be signing an Executive Order to temporarily suspend immigration into the United States!," Donald Trump tweeted this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X