వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఏడాది పాటు అలీబాబా ఛైర్మెన్‌గానే కొనసాగుతాను: జాక్‌మా

|
Google Oneindia TeluguNews

Recommended Video

మరో ఏడాది పాటు అలీబాబా ఛైర్మెన్‌ గానే కొనసాగుతాను: జాక్‌మా

చైనాకు చెందిన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్‌మా పదవీవిరమణ చేస్తారనే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే జాక్‌మా ఈ రోజు రిటైర్ కారని మరో ఏడాది తర్వాత ఇదే రోజున రిటైర్అవుతారని అంతవరకు అలీబాబా ఛైర్మెన్‌గానే కొనసాగుతారని వెల్లడించింది. జాక్‌మా పదవీ విరమణ చేసిన అనంతరం ఆ బాధ్యతలను డేనియల్ జాంగ్ ఛైర్మెన్ బాధ్యతలు చేపడతారని వెల్లడించింది.

అలీబాబా నుంచి జాక్ మా రిటైర్మెంట్అలీబాబా నుంచి జాక్ మా రిటైర్మెంట్

'కంపెనీ అవసరాల రీత్యా మరో ఏడాది పాటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతాను. 2020 వరకు అలీబాబా బోర్డు డైరెక్టర్‌గా ఉంటాను. సెప్టెంబరు 10, 2019న కంపెనీ సీఈవో డేనియల్‌ జాంగ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు' అని అలీబాబా సిబ్బంది, కంపెనీ పత్రిక సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టుకు రాసిన లేఖలో జాక్‌ మా పేర్కొన్నారు.

I will continue as chairman of Alibaba for one more year,clarifies Jackma

సెప్టెంబర్ 10 జాక్‌మా 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అలీబాబా సంస్థ నుంచి పదవీవిరమణ చేస్తారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. 54వ పుట్టిన రోజు తర్వాత జాక్‌మా పదవీవిరమణ చేయనున్నట్లు తమ ఇంటర్వ్యూలో చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే అలీబాబా సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఊహాగానాలకు తెరదించుతూ నేడు అలీబాబా అధికారిక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది సెప్టెంబరు 10న అంటే.. 55వ పుట్టినరోజున జాక్‌ మా పదవీ విరమణ చేస్తారని వెల్లడించింది.

చైనీయులు ఎక్కువమంది అలీబాబా ద్వారానే షాపింగ్ చేసే పరిస్థితి, పేమెంట్స్ చేసే పరిస్థితి ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా మరో కంపెనీ లేదని చెప్పవచ్చు. అలీబాబా వ్యవస్థాపకుడు అయిన జాక్ మా నికర విలువ 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. దీంతో అతను చైనాలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. చైనీయులు అందరూ ఇతనిని ఎంతో ఆరాదిస్తారు. ఇళ్లలో ఇతని ఫోటోలు పెట్టుకొని పూజించేవారు కూడా ఉన్నారు.

English summary
News has been making rounds that China's ecommerce company Alibaba founder Jackma will retire from his duties on his 54th birthday. But an official letter released by Jackma said that he would continue to be as chairman of the company till next year. He also anounced Daniel zhang would be his next successor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X