వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియా కిమ్ అదృశ్యమైపోతే..: సీఐఏ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ హఠాత్తుగా కనిపించకుండాపోతే మమ్మల్ని మాత్రం అడక్కండి.. అని అమెరికా నిఘా సంస్థ చీఫ్ మైక్ పొంపియో ఛలోక్తి విసిరారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలో.. కిమ్ హఠాత్తు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పై అమెరికా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయన ఒక తెలివైన నటుడనీ.. అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పేర్కొంది.

అంతేకాదు, కిమ్ హఠాత్తుగా కనిపించకుండాపోతే మమ్మల్ని మాత్రం అడక్కండి.. అని అమెరికా నిఘా సంస్థ చీఫ్ మైక్ పొంపియో ఛలోక్తి విసిరారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలో.. కిమ్ హఠాత్తుగా మరణిస్తే ఏం జరుగుతుంది? అనే ప్రశ్న తలెత్తింది.

If Kim Jong-Un should disappear... don't ask the CIA

సీఐఏ డైరెక్టర్‌ మైక్ పొంపియోను ఒకరు ఇలా ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ...
''ఒకవేళ కిమ్ జాంగ్ అదృశ్యమైతే, సీఐఏ చరిత్రని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని అడగొద్దు. నేను దాని గురించి మాట్లాడబోను...'' అని వ్యాఖ్యానించారు.

అణుపరీక్షల పేరుతో ప్రస్తుతం అమెరికాకి ఉత్తరకొరియా కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం వాషింగ్టన్‌లో కిక్కిరిసిన భద్రతాధికారుల సమావేశంలో సీఐఏ చీఫ్ మాట్లాడారు.

కిమ్ అదృశ్యానికి, ప్రస్తుత పరిస్థితులకు ముడిపెడుతూ కొంతమంది ఆలోచించే అవకాశం ఉన్నందునే తానీ వివరణ ఇస్తున్నానని ఆయన చెప్పారు. ''మీకు తెలుసా? అక్కడో యాక్సిడెంట్ జరగొచ్చు.. అది మంచిది కాదు...'' అని మైక్ పేర్కొనడంతో సమావేశంలో నవ్వులు పూశాయి.

అమెరికా నిఘా సంస్థ సీఐఏకి పలు దేశాధినేతల హత్యల్లో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్, క్యూబా, కాంగో, వియత్నాం, చిలీ వంటి దేశాధినేతల హత్యలకు కుట్రపన్నినట్టు సీఐఏకి చీకటి చరిత్ర ఉంది.

మరోవైపు కిమ్ జాంగ్‌ను చంపేందుకు సీఐఏ దక్షిణ కొరియా నిఘా సంస్థలతో కలిసి కుట్ర పన్నుతోందంటూ ఉత్తర కొరియా ఇప్పటికే ఆరోపణలు కూడా గుప్పించింది.

English summary
The US Central Intelligence Agency thinks that North Korea's Kim Jong-un is a rational actor who is focused on staying in power and "waking up in his own bed" each day. "With respect to, if Kim Jong-Un should vanish, given the history of the CIA, I'm just not going to talk about it," the CIA director said Thursday, when asked what would happen if Kim suddenly died. "Someone might think there was a coincidence. 'You know, there was an accident.' It's just not fruitful," he said to laughs from a Washington audience full of national security officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X