లక్షణాలు లేకుంటే లక్షణంగా తిరగొచ్చు.. పాజిటివ్ వచ్చిన సరే.. ఆ దేశంలో అనుమతి
కరోనా భయాందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతుంది. ఒమిక్రాన్.. దాని సబ్ వేరియంట్ కూడా వచ్చింది. అయితే కరోనాకు టీకా తీసుకోవడం.. లేదంటే మాస్క్ పెట్టుకొని ఉండటమే శ్రీరామ రక్ష అని నిపుణులు చెబుతున్నారు. శానిటేజషన్, భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ సోకిన వారు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్లో ఉండాలనే నిబంధన ఉంది. దక్షిణాఫ్రికాలో వైరస్ ఉధృతి తగ్గుముఖం తగ్గుముఖం పడుతుండడంతో ఆంక్షలను సడలిస్తున్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది.
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్ అవసరమే లేదని ప్రకటించింది. స్కూళ్లలో భౌతిక దూరం ఉండాలనే నిబంధన కూడా ఎత్తివేసింది. టెస్టులు చేయించుకున్న తర్వాత లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొంది. వైరస్ బారిన పడిన వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన వారిలో లక్షణాలు లేకుంటే వారు కూడా ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. అంటే పాజిటివ్ వచ్చి.. లక్షణాలు కనిపిస్తేనే ఐసోలేషన్ లేదంటే లేదని స్పష్టంచేసింది.

60 నుంచి 80 శాతం ప్రజల్లో కోవిడ్ ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఉందని సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేదంటే మాత్రం జరిమానా తప్పదని స్పష్టంచేసింది. కానీ కరోనా సోకి.. లక్షణాలు లేకుంటే లక్షణంగా మాస్క్ ధరించి తిరగొచ్చు అని అనుమతి ఇచ్చింది.
ఇటు భారత దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.