వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చీరాని ఇంగ్లీష్ తెచ్చిన తంట..! బొమ్మ విమానాలకు ఆర్డర్ చేస్తే నిజమైనవి వచ్చేసాయి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వచ్చీరాని ఇంగ్లీష్ భాష ఓ ధనవంతుడిని చిక్కుల పాలు చేసింది. సౌదీ అరేబియాలో జరిగిన ఈ సంఘటన పట్ల తన కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతున్నారట. సౌదీ అరేబియాలో కుబేరులకు కొదవ లేదు. అలాంటి ఓ కుబేరుడికి తన కొడుకంటే ఎంతో ఇష్టం. తన గారాల కుమారుడికేమో విమానాలంటే పిచ్చి. ఇంకేముంది కొడుకు బర్త్‌డే సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు తండ్రి. అసలు విమానాలను పోలి ఉండే బొమ్మ విమానం(స్కేల్ మోడల్స్) బహుమతిగా ఇద్దామనుకున్నాడు.. ఇందుకోసం ఎయిర్ బస్ కంపెనీకి ఫోన్ చేశాడు. అంత వరకూ బాగానే ఉన్నా ఆ తరువాత ఓ చిన్న చిక్కొచ్చిపడింది.

సౌదీ కుబేరుడికేమో ఇంగ్లీష్‌పై అంతగా పట్టులేదు. దీంతో ఫోన్‌లో అవతలివారి మాటలని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయాడు. ఎయిర్ బస్ ఉద్యోగులు కూడా కొంత గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో 'విమానం లోపలి డిజైన్ ఎలా ఉండాలి, బయట ఏ రంగు వేయాలి' అంటూ అనేక ప్రశ్నలు వేశారు. సౌదీ కుబేరుడేమో తనకు తోచిన సమాధానాలు చెప్పుకుంటూ పోయాడు. అన్ని ప్రశ్నలూ వేసిన తరువాత, రెండు విమానాలకు 329 మిలియన్ యూరోలు ( దాదాపు రూ. 2,600 కోట్లు) ఖర్చువుతుందని ఎయిర్ బస్ వారు చెప్పారు.

If the order for toy planes, true planes delivered..!!

దీంతో సౌదీ కోటీశ్వరుడికి కొద్దిగా అనుమానం కలిగింది. అయితే వేల కోట్లలో వ్యాపారం చేసే ఆయనకు ఇదేమంత పెద్ద విషయం కాకపోవడంతో వెంటనే ఆర్డరిచ్చి చెప్పిన మొత్తం చెల్లించాడు. వారు బోలెడన్ని ప్రశ్నలు అడిగారు కాబట్టి అధ్బుతమైన విమానం బొమ్మలను ఇంటికి పంపిస్తారనుకున్నాడు. కాగా.. కొన్ని నెలల తరువాత ఎయిర్ బస్ వారు ఫోన్ చేశారు. రెండు ఎ350-1000 విమానాలు డెలివరీకి సిద్ధంగా ఉన్నాయన్నారు.

విమానాల్ని నడపటానికి ఎవర్ని పంపిస్తున్నారంటూ చివరిగా ఓ ప్రశ్న వేశారు. అప్పటికి గానీ సౌదీ ఆసామికి మ్యాటర్ అర్థం కాలేదు. చివరికి ఓ చిన్న స్మైల్ ఇచ్చి, చాలా కూల్‌గా విమానాల డెలివరీ తీసుకున్నాడు. ఒక విమానాన్న తన కొడుక్కి ఇచ్చి..రెండో దాన్ని తన బంధువుకు ఇచ్చేశాడు. 'వాళ్లు నన్ను చాలా ప్రశ్నలు వేశారు. దీంతో..నేను కొనబోయే బొమ్మలు అచ్చు నిజం విమానాల్లాగా ఉంటాయనుకున్నాను. వారు చెప్పిన ధరకు ఓకే చెప్పాను. కరెన్సీ మారకపు లెక్కలు కూడా నన్ను కొంత గందరగోళానికి గురిచేశాయి.." అని తాపీగా చెప్పాడట.

English summary
Father was the one who wanted to give a surprise on his son's birthday. He wanted to gift toy aircraft (scale models) that resemble the original planes. He phoned the Airbus company for this purpose. Though it was so good, then a little stuck. Saudi bellianeer is not perfect on English. This failed to understand the words in the phone. The Saudi bellianeer had been answering his answers. After all the questions were put, Airbus said they would cost 329 million euros (about Rs 2,600 crore) for two flights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X