వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ చెబితే వ్యాక్సిన్ తీసుకోను.. కమలా హ్యారిస్ కామెంట్స్, తోసిపుచ్చిన మైక్ పెన్స్..

|
Google Oneindia TeluguNews

అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన కమలా హ్యరిస్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మధ్య కరోనా వైరస్‌పై వాడీ వేడీ చర్చ జరిగింది. కరోనా వైరస్ నియంత్రణలో ట్రంప్ విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. దీనికి మైక్ పెన్స్ కూడా ధీటుగానే బదులిచ్చారు. ట్రంప్‌పై హ్యారిస్ చేసిన ఆరోపణలకు భవిష్యత్‌లో వచ్చే వ్యాక్సిన్ చెంప పెట్టు అవుతోందని తెలిపారు. దీంతో ట్రంప్‌పై ప్రజలకు విశ్వసనీయత మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉటా స్టేట్‌లోని సాల్ట్ లేక్ సిటీలో డిబేట్‌ కొనసాగుతోంది. వివిధ అంశాలపై మోడరేట్ ప్రశ్నలను సంధిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ, వ్యాక్సిన్‌పై చర్చ హీటెక్కించింది. కరోనా వైరస్ నియంత్రణ అతి పెద్ద వైఫల్యం అని.. ఇదివరకు దేశ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదని హ్యారిస్ విరుచుకుపడ్డారు.

If Trump Tells Us To Take It, Im Not Taking It: Kamala Harris On Covid Vaccine

కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై కూడా మాటల యుద్ధం జరిగింది. వైద్య నిపుణులు డాక్టర్ ఫౌసీ చెబితే తాను కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకుంటానని హ్యారిస్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ముందువరసలో నిలుస్తానని చెప్పారు. కానీ డొనాల్డ్ ట్రంప్ తీసుకోవాలని చెబితే మాత్రం నిరభ్యంతరంగా తీసుకోనని బల్లగుద్దీ మరీ చెప్పారు.

హ్యారిస్ వ్యాక్సిన్ తీసుకోనని చెప్పడంపై మైక్ ఫెన్స్ మండిపడ్డారు. వ్యాక్సిన్ త్వరగా వచ్చేందుకు అధ్యక్షుడు ఒత్తిడి చేస్తాడా..? లేని విషయాలను ఎందుకు ఉన్నట్టు చెబుతారు అని మండిపడ్డారు. ట్రంప్ నేతృత్వంలో టీకా వస్తే ఎందుకు విశ్వసించడం లేదు అని ప్రశ్నించారు.

Recommended Video

Donald Trump : నిబంధనలకు విరుద్ధంగా Trump పోస్ట్.. నిర్మోహమాటంగా తొలగించిన Facebook || Oneindia

కరోనా వైరస్ అమెరికాపై తీవ్ర ప్రభావం చూపించింది. వైరస్ సోకి 2 లక్షల 10 వేల మంది చనిపోయారు. 75 లక్షల మందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో కరోనా వైరస్ అత్యధికంగా సోకిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

English summary
US Senator Kamala Harris branded the response to the COVID-19 pandemic under US President Donald Trump as the "greatest failure" of any US administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X