వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌నకు విరుగుడు: ఇండియన్లకు మెల్బా ప్రియా అండ

హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం చేస్తే భారత ఐటీ సంస్థలకు, ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పడతాయి. అయితే అమెరికా పొరుగునే ఉన్న మెక్సికో స్నేహ హస్తం అందించేందుకు సిద్ధమని సంకేతాలిచ్చింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గ్లోబలైజేషన్, టెక్నాలజీ కారణంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశీయులకు ఉపాధి కల్పన, భద్రత తదితర సాకులతో విదేశీయుల రాకపై ఆంక్షలు విధించారు. ఒకవేళ తొలుత అమెరికన్లకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్‌తో హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం చేస్తే భారత ఐటీ సంస్థలకు, ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పడతాయి.

అయితే అమెరికా పొరుగునే ఉన్న మెక్సికో స్నేహ హస్తం అందించేందుకు సిద్ధమని సంకేతాలిచ్చింది. ఇప్పటికే తమ భద్రత కోసం సరిహద్దు గోడ నిర్మిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపైన అగ్గిమీద గుగ్గిలమవుతున్న మెక్సికో.. భారతీయులకు, భారతీయ ఐటీ కంపెనీలకు అండగా నిలుస్తామని తెలిపింది. ఒకవేళ భారతీయ నిపుణులను బయటకు పంపిస్తే తమకు అంతకంటే ఆనందం మరొకటి లేదని భారతదేశంలో మెక్సికో రాయబారి మెల్బా ప్రియా వ్యాఖ్యానించారు. ఇది వైవిధ్య భరితమైన వాణిజ్య సంబంధాలకు సరైన సమయం అని, మరిన్ని మెక్సికో కంపెనీల్లో భారతీయులకు చోటు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

వాణిజ్య లావాదేవీల పెంపు, పెట్టుబడులు పెంచడం ద్వారా నిపుణుల రాకపోకతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు వైవిధ్య భరితమైన వాణిజ్య సంబంధాలకు సరైన సమయం అని, భారతదేశంపై మెక్సికో కంపెనీల ద్రుష్టిని మళ్లించేందుకు తాము చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఒకవేళ అమెరికా వీసా నిబంధనలు.. హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం చేస్తే.. అమెరికాపైనే పూర్తిగా ఆధార పడ్డ భారత ఐటీ కంపెనీలపై గణనీయ ప్రభావం పడుతుంది.

‘If US cracks down on H1B visas, we’ll be happy to have Indians relocate to Mexico’: Melba Pria

అమెరికా మార్కెట్‌ను కాపాడుకునేందుకు ఆయా కంపెనీలు అదే జోన్‌లో భాగంగా ఉన్న మెక్సికోలో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చునని చెప్పారు. విదేశీ నిపుణుల ప్రతిభకు అనుగుణంగా ఉపాధి లభిస్తుందని, అదే సమయంలో స్థానికులకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నదని మెల్బా ప్రియా తెలిపారు. తమదేశంలోని గౌదాలాజారా ఇప్పటికే టెక్నాలజీ హబ్‌గా మారిందన్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి 10 భారత ఐటీ కంపెనీలు ఈ హబ్ ద్వారా సేవలందిస్తున్నాయన్నారు.

రెండు దేశాల సరిహద్దులూ చాలా బిజీ

అమెరికా, మెక్సికో దేశాల మధ్య గల సరిహద్దు చాలా బిజీగా ఉంటుందని భారత్‌లో మెక్సికో రాయబారి మెల్బా ప్రియా తెలిపారు. తమ రెండు దేశాల మధ్య సుసంపన్నంగా ఉంటుందని, రెండు దేశాల శ్రేయస్సు కోసం, భద్రత కోసం మౌలిక వసతులు కల్పించుకోవాల్సి ఉంటుందన్నారు. టెక్నాలజీ వినియోగంతో ఎక్కడికక్కడ వంతెనల నిర్మాణంతో భద్రతను ప్రోత్సహించుకోవాల్సి ఉంటుందన్నారు.

గోడ నిర్మాణంపై ఇరు దేశాల అధ్యక్షులు పరస్పరం ఫోన్ లో సుహ్రుద్భావ వాతావరణంలో సంప్రదించుకున్నారని చెప్పారు. విభేదాలెలా ఉన్న ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చిన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు వచ్చాయి. ఫోన్ సంప్రదింపులతో సమస్య పరిష్కరించుకోవచ్చునని తమ దేశం విశ్వసిస్తున్నదని మెల్బా ప్రియా చెప్పారు. ఎల్లవేళలా ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించడంతోపాటు అటువంటి వాటిపై చర్చలకు దూరంగా ఉంటామని తెలిపారు. గోడ నిర్మాణానికి అయ్యే ఖర్చు భరించబోమని ఇప్పటికే అమెరికాకు మెక్సికో తేల్చి చెప్పింది.

అక్రమ వలసలపై అమెరికా ఆందోళన

తమ దేశంలోకి అక్రమ వలసల నివారణకు అమెరికన్లు తమ విధానాన్ని రూపొందించుకుంటున్నారని, కానీ అది క్రుత్రిమ చర్యలకు దిగడం సరి కాదని మెల్బా ప్రియా చెప్పారు. యావత్ అమెరికా, మెక్సికో దేశాల శ్రేయస్సు ద్రుష్టా చట్ట విరుద్ధ వలసలన నివారణకు చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. మెక్సికో నుంచి వివిధ రకాల వలసలు ఉంటాయని మెల్బా ప్రియా అంగీకరించారు.

అయితే ఇదంతా అమెరికన్ల శ్రేయస్సు కోసమే జరుగుతున్నదన్నారు. అమెరికా జీడీపీలో మెక్సికన్ సిబ్బంది 8శాతం వాటా పొందుతున్నారని తెలిపారు. మెక్సికన్ వలస కార్మికులు అమెరికాలో 5.7 లక్షల మంది ఉంటారన్నారు. ప్రతియేటా ఉపాధి కల్పిస్తూ 17 బిలియన్ల డాలర్ల రెవెన్యూ సాధిస్తున్నారన్నారు. ఐదు లక్షల మందికి పైగా మెక్సికన్ నిపుణులు అమెరికాలో అత్యున్నత విద్యా కోర్సులను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారిలో వైద్యులు, ఇంజినీర్లు, ఇతర నిపుణులు ఉన్నారని వివరించారు.

రెండు దేశాలు సార్వభౌమత్వ దేశాలే

మెక్సికో, అమెరికా కూడా సార్వభౌమత్వం గల దేశాలేనని మెల్బా ప్రియా చెప్పారు. తమ పొరుగు దేశం అనుసరించే విధానాలను బట్టే మెక్సికో తన ప్రాథమ్యాలను, విధానాలను ఖరారు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు మెక్సికోపై ప్రతికూల ప్రభావం చూపే స్థాయిలో అమెరికా నిర్ణయాలు తీసుకోనందున తాము స్పందించడం సరి కాదన్నారు. అమెరికాకు మెక్సికో కీలక వాణిజ్య భాగస్వామి అన్న విషయం విస్మరించొద్దన్నారు. ప్రతి రోజూ రెండు దేశాల మధ్య 1400 మిలియన్ల డాలర్ల వ్యాపారం సాగుతుంది. ఏటా ఐదు లక్షల డాలర్ల వ్యాపారం సాగుతుందని అంచనా.

English summary
CALLING BORDERS a “living and ever-changing phenomena”, Mexico’s Ambassador to India Melba Pria said borders have their own cause-and-effect migration dynamics which are unlikely to be changed by “artificial actions” a reference to US President Donald Trump’s plans to build a wall along the US-Mexico border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X