వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాదేదీ జరిమానాకు అనర్హం..!ఆదేశంలో మాస్క్ ధరించకుంటే చెల్లించాల్సిందే భారీ మూల్యం.!

|
Google Oneindia TeluguNews

దుబాయి/హైదరాబాద్ : ప్రపంచ దేశాలు కరోనా వైరస్ కు ఎంత భయపడుతున్నాయో ఈ ఉదంతం రుజువు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశం, చెందని దేశం, సంపన్న దేశం, పేద దేశం అనే తారతమ్యం లేకుంగా కంటికి కనిపించని కరోనా వైరస్ అన్ని దేశాలను మడతెట్టేస్తోంది. భూతల స్వర్గంగా గుర్తించబడ్డ దుబాయి లాంటి అత్యంత ధనికులుండే దేశాన్ని కూడా కరోనా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఏ ఒక్కరిని వదలకుండా అందరి కళ్లలో భయాన్ని నింపుతోంది కరోనా. కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు దుబాయి కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది.

మనసును పిండేస్తున్న రాంపుకార్ పండిట్ ఫోటో వెనుక అసలు కథ ఇదేమనసును పిండేస్తున్న రాంపుకార్ పండిట్ ఫోటో వెనుక అసలు కథ ఇదే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా..

దేశాన్ని మొత్తం షట్ డౌన్ చేయడమే కాకుండా, రాత్రంతా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అంతే కాకుండా మాస్క్ ధరించని వారి పట్ల కఠిన ఆంక్షలు కూడా అమలు చేస్తోంది. దిమ్మతిరిగే జరిమానా విధించి ప్రతిఒక్క దుబాయి పౌరుడికి చుక్కలు చూపిస్తోంది ప్రభుత్వం. ఐతే ప్రభుత్వం విధిస్తోన్న జరిమానా చెల్లింపులతో మాస్కుల దుకాణం పెట్టుకోవచ్చనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించేబదులు మాస్క్ ధరంచడమే ఉత్తమమైందని దుబాయి ప్రజలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ మాస్క్ ధరించకపోతే దుబాయి ప్రభుత్వం విధించే జరిమానా ఎంతో తెలుసా..?

దుబాయి లో దుమారం రేపుతున్న కరోనా..

దుబాయి లో దుమారం రేపుతున్న కరోనా..

కరోనావైరస్ నియంత్రలో ప్రపంచ దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక వ్యక్తికి సోకిన వ్యాధితో ఆగకుండా తనతో పాటు సాన్నిహిత్యం ఉన్న అందరికీ ఈ వ్యాధి అంటుతోంది. దీంతో ప్రభుత్వాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. జనం మాత్రం నిర్లక్ష్యంగా అడపాదడపా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న కఠిన నిర్ణయాల మాదిరిగానే ఆంక్షలు అమలు చేయడంలో తమ దేశం ఏమీ అతీతం కాదంటోంది దుబాయి దేశం. దీంతో దుబాయ్ ప్రభుత్వం మాస్క్ ధరించకుంటే భారీ జరిమానా తప్పదంటూ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.

మాస్క్ ధరించకుంటే పెద్ద జరిమానా..

మాస్క్ ధరించకుంటే పెద్ద జరిమానా..

కరోనా కట్టడికి అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. కొవిడ్-19ను కట్టడి చేయాలంటే ఈ మాత్రం నిబంధనలు ఉండాల్సిందేనంటోంది దుబాయి ప్రభుత్వం. కొవిడ్ 19 నిబంధనలు పాటించడంలో ఏ చిన్న నిర్లక్ష్యం వహించనా భారీ మూల్యం చెల్లించకతప్పదనే హెచ్చరికలు జారీ చేస్తోంది. అందులో భాగంగా దేశంలోని ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా మాస్క్ ధరించకుంటే ఏకంగా 3,000 దిర్హామ్స్ అంటే అక్షరాల 61,772 రూపాయల జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దుబాయి ప్రజలకు దిమ్మతిరిగినంత పనైనట్టు చర్చ జరుగుతోంది.

 రాత్రి కర్ఫ్యూ పొడింగించి అరబ్ దేశం..

రాత్రి కర్ఫ్యూ పొడింగించి అరబ్ దేశం..

క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘిస్తే 10,29,539 రూపాయల చొప్పున జరిమానా విధించాలని దుబాయ్ పాలకులు చట్టం చేశారు. పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించేవారికి ఏకంగా 20 లక్షల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇక రోజువారీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి పూట రెండు గంటల పాటు కర్ఫ్యూను పొడగిస్తున్నట్టు దుబాయ్‌ ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఇకపై రాత్రి ఎనిమిది గంటలకు మొదలై ఉదయం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే విమానాల రాకపోకలపై అంక్షలు విధించిన ప్రభుత్వం, రంజాన్ పండుగ సందర్భంగా షాపింగ్ చేసుకునేందుకు మాత్రం స్వల్ప మినాహాయింపులు కల్పించింది దుబాయి ప్రభుత్వం.

English summary
The Dubai government is issuing warnings to the people of the country that if they do not wear a mask, they will be fined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X