బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూపర్: అమెరికా మిలటరీ కాంట్రాక్టు భారత్ కే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: బెంగళూరు నగరంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్ సీ) ఓ అరుదైన అవకాశం దక్కించుకుని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. అమెరికా మిలటరీకి చెందిన ఓ ప్రాజెక్టు అభివృద్ది చేసే కాంట్రాక్టు సొంతం చేసుకునింది.

యూఎస్ మిలటరీకి చెందిన సోలార్ పవర్ మైక్రో గ్రిడ్ అభివృద్ది చెయ్యడానికి అమెరికా కాంట్రక్టు ఇవ్వడానికి సిద్దం అయ్యింది. ఈ కాంట్రాక్టును ఐఐఎస్ సీ సొంతం చేసుకునింది. ఈ కాంట్రాక్టుకు 52,000 వేల యూఎస్ డాలర్లను యూఎస్ పసిఫిక్ ఎయిర్ పోర్స్ నిధులు కేటాయించింది.

IISC has bagged a US military contract

భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గురువారం వాషింగ్టన్ లోని పెంటాగాన్ లో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి అస్టోన్ కార్టన్ తో భేటీ అయ్యారు. భారత్-అమెరికా దేశాల మధ్య ధీర్ఘకాలిక ప్యూహాత్మక చర్చల్లో భాగంగా పారికర్ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు దక్కిన అరుదైన అవకాశాల్లో ఈ యూఎస్ మిలటరీ కాంట్రాక్టు ఒకటి. అమెరికా దగ్గర మన సత్తా చూపిస్తామని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు అంటున్నారు. ఐఐఎస్ సీలో సంబరాలు చేసుకుంటున్నారు.

English summary
The prestigious Indian Institute of Science has bagged a US military contract for research and development on solar powered micro-grid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X