వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌ సీటుకు ఎసరు.. ప్రత్యర్థిపై విషప్రచారం, ఆ దేశం అధ్యక్షుడితో కుమ్మక్కు అంటూ

|
Google Oneindia TeluguNews

వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్‌పై విషప్రచారం చేసేందుకు విదేశీ సహాయం కోరినట్లు ఆరోపిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో మంగళవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్లు అధికారిక అభిశంసన విచారణ ప్రారంభించారు.

 ట్రంప్ అభిశంసన పై విచారణ

ట్రంప్ అభిశంసన పై విచారణ

అభిశంసన విచారణ జరిపించడం ద్వారా రానున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నిజమైన రిపబ్లికన్, డెమొక్రాట్ మద్దతుదారులను ఆలోచింప జేస్తుందని భావిస్తున్నారు. డెమొక్రటిక్ ప్రజాప్రతినిధులతో రహస్య సమావేశం అనంతరం స్పీకర్ నాన్సీ పెలోసీ విచారణకు ఆదేశించారు. అంతేకాదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో పాటు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయ్యిందని ఆమె పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆమె పేర్కొన్నారు.

డెమొక్రాట్లు ఓర్వలేకున్నారు

డెమొక్రాట్లు ఓర్వలేకున్నారు

ఇదిలా ఉంటే తనపై అభిశంసన విచారణ ప్రారంభించారని తెలుసుకున్న డొనాల్డ్ ట్రంప్ వెంటనే ట్విటర్ ద్వారా స్పందించారు. తన ప్రభుత్వం చేసిన పనితనం సాధించిన విజయాలపై డెమొక్రాట్లు ఓర్వలేకపోతున్నారని ట్రంప్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై విషప్రచారం చేసి లబ్ధి పొందాలని డెమొక్రాట్లు భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇది దేశానికి మంచిది కాదని ట్రంప్ మండిపడ్డారు.

ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఏమన్నారు?

ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఏమన్నారు?

జూలై 25న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో జరిగిన ఫోన్ సంభాషణలో డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి బరిలో ఉన్న జోబిడెన్‌పై విచారణ జరపాలని ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు స్పీకర్ నాన్సీ దృష్టికి డెమొక్రాట్లు తీసుకొచ్చారు. జోబిడెన్, అతని కొడుకు అంతకుముందు ఉక్రెయిన్‌లోని ఓ గ్యాస్ డ్రిల్లింగ్ కంపెనీలో పనిచేసినట్లు చెప్పారు.

 ఫోన్ కాల్ వివరాలను బయటపెడాతనన్న ట్రంప్

ఫోన్ కాల్ వివరాలను బయటపెడాతనన్న ట్రంప్

అయితే తాను జూలై 25న సంభాషణలు జరిపిన ఫోన్‌కాల్‌ వివరాలను బయటపెడుతానని చెప్పారు. తాను జోబిడెన్‌ గురించి మాట్లాడినది వాస్తవేమనని అయితే డెమొక్రాట్లు చేస్తున్న ఆరోపణలు మాత్రం అవాస్తవమని ట్రంప్ పేర్కొన్నారు. జోబిడెన్‌పై దుష్ప్రచారం చేస్తే అమెరికా 400 మిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం చేస్తానని ట్రంప్ చెప్పినట్లు డెమొక్రాట్లు వెల్లడించారు.

ఉక్రెయిన్‌ విషయంలో క్విడ్‌ ప్రో కో పాల్పడలేదు

ఉక్రెయిన్‌ విషయంలో క్విడ్‌ ప్రో కో పాల్పడలేదు

తనపై వస్తున్న ఆరోపణలను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ట్రంప్ ఖండించారు. జోబిడెన్‌పై దుష్ప్రచారం చేయాల్సిందిగా ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదని అయితే ఉక్రెయిన్‌కు సహాయం చేయాలని భావించి నిధులు ఇస్తానని మాత్రమే చెప్పాను తప్ప క్విడ్‌ప్రో కోకు తాను పాల్పడలేదని ట్రంప్ వెల్లడించారు. ఆ తర్వాత నిధులను ట్రంప్ సర్కార్ విడుదల చేసింది. ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు ఒక్క అమెరికానే కాదు యూరప్ దేశాలు కూడా ముందుకు రావాలని ట్రంప్ కోరారు.

English summary
US House began enquiry into the impeachement of its President Donald Trump for pressuring the Ukraine President to smear Democratic rival Joe Biden ahead of next year's election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X