వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Impressive: మోడీ భారీ ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, ఇంకా ఏమందంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. లాక్‌డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రశంసించింది. భారీ ఆర్థిక విపణులు, ఉద్దీపనలు అమలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని అభిప్రాయపడింది.

మోడీ భారీ ప్యాకేజీపై ప్రశంసలు

మోడీ భారీ ప్యాకేజీపై ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు మంగళవారం రూ. 20 లక్షల కోట్లతో భారీ స్వావలంబన పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, వరల్డ్ ఎకనామిక్ సిచూవేషన్ అండ్ ప్రాస్పెక్ట్(డబ్ల్యూఈఎస్పీ) నివేదికను ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ శాఖ అధిపతి హమీద్ రషీద్.. భారత్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.

మోడీ ప్యాకేజీ ఉత్తమమే.. కానీ..

మోడీ ప్యాకేజీ ఉత్తమమే.. కానీ..

ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకం ఉత్తమంగా ఉందని అన్నారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ, భారత జీడీపీలో 20 శాతం ఉందని.. అంటే అది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటి వరకు అతిపెద్దదని తెలిపారు. చాలా దేశాలు జీడీపీలో 0.5 శాతం లేదా 1 శాతానికే పరిమితమవుతున్నాయని అన్నారు. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక విపణి, ఉద్దీపనను అమలు చేయగలిగే సాధానాలున్నాయని తెలిపారు. అయితే, ప్యాకేజీని ఎలా రూపొందించారన్న దాన్ని బట్టి దాని ప్రభావంటుందని అన్నారు. భారీ ఉద్దీపన పథకాలు ప్రకటించిన అమెరికా (జీడీపీలో 13శాతం), జపాన్(జీడీపీలో 21శాతం) తర్వాత మనదేశమే ఆ స్థాయి ఉద్దీపనను ప్రకటించింది.

మోడీ ప్యాకేజీ ఆకర్షణీయం.. లాక్‌డౌన్ అమలు భేష్

మోడీ ప్యాకేజీ ఆకర్షణీయం.. లాక్‌డౌన్ అమలు భేష్

ఇది ఇలావుండగా, ఎకనామిక్ అనాలసిస్ అండ్ పాలసీ డివిజన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫైర్స్(ఈఏపీడీ/యూఎన్ డీఈఎస్ఏ) అసోసియేట్ ఎకనామిక్ ఎఫైర్స్ ఆఫీసర్ జులియన్ స్లాట్‌మన్ మాట్లాడుతూ.. మోడీ ప్రకటించిన ప్యాకేజీ అత్యంత ఆకర్షణీయంగా ఉందన్నారు. ఇది మార్కెట్లకు ఊతమిస్తుందని, ప్రజలు కొనుగోళ్లు చేయకపోతే మాత్రం ఇంద్రజాలం తరహాలో వెంటనే ఫలితాలు కనిపించవని అన్నారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ మంచి ఫలితాలనిస్తోంది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి మందగించింది. అధిక జనాభా, సంక్లిష్టమైన భారతదేశంలో కఠిన లాక్‌డౌన్ అవసరం. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెంచుతోందని, పేదలపైనా ప్రభావం ఉందని జులియన్ పేర్కొన్నారు.

Recommended Video

Nirmala Sitharaman Announces Free Ration To All Migrants For Next Two Months
భారత జీడీజీ అంచనా..

భారత జీడీజీ అంచనా..


కాగా, భారత జీడీపీ వృద్ధిరేటును ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2020-21కి గానూ వృద్ధిరేటు 1.2శాతంగా అంచనా వేసింది. 2019లో 4.1 శాతంగా ఉన్న భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.2గా ఉంటుందని, 2021కి 5.5శాతానికి పుంజుకోగలదని అంచనా వేసింది. ఇక ప్రపంచ జీడీపీ 3.2 శాతమే ఉంటుందని, మొత్తంగా 2020,21 ఉత్పత్తిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.5 ట్రిలియన్ డాలర్లు నష్టపోతుందని వెల్లడించింది. గత నాలుగేళ్ల లాభాలను తుడిచిపెట్టనుందని పేర్కొంది.

English summary
‘Impressive’: Modi’s economic package gets UN economic experts high praise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X