వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎస్‌ఎస్‌ను నాజీలతో పోల్చిన ఇమ్రాన్ ఖాన్, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో మోడీ ప్రభుత్వం ఉందన్న పాక్ ప్రధాని

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌పై భారత్ చేయి సాధించడంతో పాకిస్థాన్‌కు మింగుడు పడడం లేదు. పాకిస్థాన్ కోరుకున్నట్టు అక్కడ ఎలాంటీ ఘర్షణలు, ఆందోళనలకు తావు లేకుండా పోవడంతో,భారత్‌పై పాకిస్థాన్ కసి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏదో ఒక రూపంలో తన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పున:సమీక్షించాలని ఆయన నిర్ణయించడంతో పాటు రెండు దేశాల మధ్య ప్రయాణ అవకాశాలను కూడ మూసి వేసిన ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంపై మళ్లించాడు.

ఈనేపథ్యలోనే మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కొనసాగుతోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం విమర్శించాడు. మరోవైపు ఆర్ఎస్ఎస్ ను నాజీలుగా పోల్చాడు. నాజీల ఆర్యన్ ఆధిపత్యం వలే ఆర్ఎస్ఎస్ యొక్క హిందూ భావజాలాన్ని మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుండడంపై తాను కలత చెందుతున్నానని ట్విట్టర్లో పెర్కోన్నాడు.

Imran Khan alleges India attempting to change Kashmir’s demography

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలు భారత దేశంలోని ముస్లింలను అణగదోయడానికి దారి తీస్తాయని అన్నారు. ఈనేపథ్యంలోనే ఆయన అందోళన వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మరోసారి కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో భారత్ ఆ చర్యలను ఇప్పటికే తిప్పికొట్టింది. కశ్మీర్ సమస్య భారత అంతర్గత వ్యవహారంగా తేల్చిన భారత్ అందుకు అనుగుణంగా పాకిస్తాన్‌ చర్యలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సంధర్భంగానే భారత్ పాకిస్థాన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది.

English summary
The Pakistan prime minister accused the Centre of working at the behest of the Rashtriya Swayamsewak Sangh comparing it to the Nazi.he alleged that it is “attempt to change the demography of Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X