వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోటో షూట్ కోసం ఉద్యోగి కోటు అడిగి తీసుకున్న ఇమ్రాన్ ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచి: పాకిస్తాన్‌కు కాబోయే ప్రధానమంత్రి, పీటీఐ అధ్యక్షులు తన పక్కన ఉన్న ఓ ఉద్యోగి కోటు అడిగి ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫొటో దిగడం కోసం ఇమ్రాన్ ఖాన్‌ కాసేపు సదరు ఉద్యోగి కోటును అడిగి తీసుకున్నారు.

సోమవారం ఇమ్రాన్‌ ఖాన్‌ తెలుపు రంగు సల్వార్‌ కమీజ్‌ వేసుకొని జాతీయ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ రిజిస్ట్రేషన్‌ కార్డు తీసుకోవడం కోసం ఆయన ఫొటో దిగవలసి వచ్చింది. అందుకు జాతీయ అసెంబ్లీలో పనిచేసే ఓ ఉద్యోగి వేసుకున్న నలుపు రంగు కోట్‌ను తీసుకున్నారు.

 Imran Khan borrows photographers waistcoat for NA photo session

ఆ కోటు ధరించేందుకు ఆ ఉద్యోగి ఇమ్రాన్ ఖాన్‌కు సహకరించారు. దానిని ధరించి తర్వాత ఆయన స్టూల్‌పై కూర్చుని ఫొటో దిగారు. కాగా, 15 జాతీయ అసెంబ్లీ తొలి సమావేశాలకు ఆయన హాజరయ్యారు. జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు బిల్వాల్‌ భుట్టో జర్దారీతో కరచాలనం చేసి ఆయనతో కలిసి ఇమ్రాన్ ఖాన్‌ ఫొటో దిగారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.

English summary
Prime Minister elect Imran Khan faced a wardrobe malfunction moment after he was sworn in as member of the National Assembly on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X