వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్‌ఖాన్‌కు తప్పిన ముప్పు... న్యూయార్క్‌లో ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఫైలట్లు తిరిగి న్యూయార్క్ తరలించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాల్గొనేందుకు ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. గత ఆరురోజుల నుంచి ఆయన అమెరికాలో ఉండి.. తిరిగి పాకిస్థాన్ బయలుదేరగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

శుక్రవారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగించారు. తర్వాత స్వదేశానికి పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌లో బయలుదేరారు. విమానంలో ఇమ్రాన్‌ఖాన్, అతని బృందం ఉన్నారు. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తుంది. దీంతో తిరిగి ప్లైట్‌ను న్యూయార్క్ తరలించారు. తిరిగి న్యూయార్క్ వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ బృందం ఇవాళ అమెరికాలో ఉండనుంది.

imran khan flight technical glitch.. emergency land in newyork

పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో నెలకొన్న సాంకేతిక సమస్య తీరిన వెంటనే ఆదివారం ఉదయం పాకిస్థాన్ బయల్దేరతారు. ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదని ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగించారు.

కొందరికీ ఇస్తాం ఫోబియా పట్టుకుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో శుక్రవారం విమర్శించారు. ముఖ్యంగా 9/11 దాడులు జరిగిన తర్వాత ముస్లింలను నిందించడం పనిగా పెట్టుకున్నారని తెలిపారు. అంతకుముందు ముస్లింలతో మిగతావారు సాధారణంగా ఉండేవారని.. కానీ తర్వాత మార్పొచ్చిందని తెలిపారు. ముస్లిం మహిళలు బురఖా ధరించిన కొన్నిదేశాలు సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు. బురఖా వెనుక ఆయుధాలు ఏమైనా పెట్టుకుంటారా అని ప్రశ్నించారు.

English summary
Pakistan Prime Minister Imran Khan flight had to make an emergency landing in New York technical glitch. Imran Khan and his delegation were on the way back to Pakistan but the plane had to be rerouted to New York due to the technical fault.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X