వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఇమ్రాన్ అక్రమ సంతానం ఐదుగురు, భారతీయులు కూడా’: ఎన్నికల వేళ రెహమ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య రెహమ్ ఖాన్‌ తన మాజీ భర్త గురించిన పలు వివాదాస్పద విషయాలను వెల్లడించారు. ఇమ్రాన్ సంతానంలో భారతీయులు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద విషయాలన్నీ ఆమె పుస్తకంలో వివరించడం గమనార్హం.

మొదటి భార్యకు తెలుసు

మొదటి భార్యకు తెలుసు

ఇమ్రాన్‌కున్న సంతానం గురించి ఇమ్రాన్ తనకు వెల్లడించారని తెలిపింది. అయితే, ఈ విషయాలు ఆయన మొదటి భార్య జెమ్మిమా గోల్డ్‌ స్మిత్‌కు మాత్రమే తెలుసని రెహమ్ ఖాన్ తెలిపింది.

సంతానంలో భారతీయులు కూడా

సంతానంలో భారతీయులు కూడా

‘ఇమ్రాన్‌‌కు సితా వైట్‌కు జన్మించిన టైరియన్‌ వైట్ గురించి మా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో ఆయన టైరియన్‌ వైట్ ఒక్కతే కాదని, తనకు ఐదుగురు సంతానం ఉన్నారని అప్పుడు వెల్లడించాడు. వారిలో కొంతమంది భారతీయులు ఉన్నారని చెప్పారు' అని రెహమ్ ఖాన్ తన పుస్తకంలో వెల్లడించింది.

పెద్ద కొడుకు వయస్సు 34ఏళ్లు..

పెద్ద కొడుకు వయస్సు 34ఏళ్లు..

అంతేగాక, ఇమ్రాన్‌కున్న పిల్లల్లో అతి పెద్దవాళ్ల వయసు 34 ఏళ్లని చెప్పినట్లు చెప్పడం గమనార్హం. ఇమ్రాన్‌కు పాక్‌ ప్రధాని కావాలని కోరిక ఉండేదని అందులో వివరించింది.

ఎన్నికల వేళ ఇమ్రాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే..

ఎన్నికల వేళ ఇమ్రాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే..

కాగా, ఇమ్రాన్ డ్రగ్స్ అలవాటు ఉందని, అలాగే ఆయన పాల్పడిన అవినీతి గురించి ఆమె ఆందులో వివరించడం గమనార్హం. జులై 25న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె వెల్లడించిన విషయాలు ఇతర రాజకీయ పక్షాలకు ఆయుధాలుగా మారనున్నాయి. ఈ ఆరోపణలు, విమర్శలు ఇమ్రాన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చపెట్టినట్లయింది. కాగా, ఇమ్రాన్ ఖాన్‌ను వివాహమాడిన రెహమ్.. తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే.

English summary
Reham Khan, ex-wife of Imran Khan, in her new book has claimed that former Pakistani cricket team captain and now a chairman of Pakistan Tehreek-e-Insaf, has five illegitimate children and some of them are Indian. Reham’s book title ‘Reham Khan’ was released in Amazon Kindle on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X