వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెదిరింపులు: పాక్‌ను వదిలివెళ్లిన ఇమ్రాన్ మాజీ భార్య రెహమ్, బయోగ్రఫీనే కారణమా?

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: తీవ్రమైన బెదిరింపులు వస్తుండటంతో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ గత ఆదివారం రాత్రి పాకిస్థాన్ వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. పాకిస్థాన్ న్యూస్ ఛానళ్లు కూడా ఈ విషయం ధృవీకరించడం గమనార్హం.

బ్రిటీష్ పాకిస్థాన్ జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్.. ఈ బెదిరింపుల నేపథ్యంలో తన కూతురును ఇక్కడ చదివించలేనని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్‌లోని ఏ రాజకీయ పార్టీ కూడా తనకు అండగా ఉండలేదని ఆమె వాపోయారు.

 రాజకీయ జోక్యమే కారణమా?

రాజకీయ జోక్యమే కారణమా?

44ఏళ్ల రెహమ్ ఖాన్ పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న కారణంగానే రాజకీయ నేతగా మారిన పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ ఆమె నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బ్రిటన్‌కు చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్న ఇమ్రాన్ ఖాన్.. ఆమెకు 2004లో విడాకులిచ్చారు. ఆ తర్వాత రెహమ్ ఖాన్‌ను వివాహంచేసుకున్న విషయం తెలిసిందే.

 బయోగ్రఫీ వల్లే బెదిరింపులా?

బయోగ్రఫీ వల్లే బెదిరింపులా?

కాగా, రెహమ్ ఖాన్ బయోగ్రఫీకి సంబంధించిన పుస్తకం ఒకటి తాజాగా విడుదల కావాల్సి ఉంది. ఈ పుస్తకంలో ఇమ్రాన్ ఖాన్‌తో తన వివాహం, వివాదాల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది.

 రెహమ్ బయోగ్రఫీలో..

రెహమ్ బయోగ్రఫీలో..

ఇటీవల జియో టీవీతో రెహమ్ ఖాన్ మాట్లాడుతూ.. తన జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయని, ఇమ్రాన్ ఖాన్‌తో వివాహం, విడిపోవడానికి గల కారణాలు, తదితర అంశఆలు ఇందులో పేర్కొనడం జరిగిందని చెప్పారు. అయితే, తన పుస్తకం ఎవరి కోపంతోనే, ద్వేషంతోనే రాయడం జరగలేదని స్పష్టం చేశారు.

 ఏ పార్టీతోనూ సంబంధం లేదు

ఏ పార్టీతోనూ సంబంధం లేదు

అంతేగాక, తాను పాకిస్థాన్‌లోని ఏ పార్టీకి కూడా మద్దతు తెలపలేదని రెహమ్ ఖాన్ తెలిపారు. అలాగే తనకు కూడా ఏ పార్టీ నుంచి మద్దతు లభించలేదని, అంతేగాక, తాను నోరు విప్పాలని కూడా ఏ పార్టీ కోరుకోవడం లేదని చెప్పారు.

English summary
Pakistan Tehreek-e-Insaf chief Imran Khan’s former wife Reham Khan has left Pakistan reportedly after receiving threats. She left the country on Sunday night after her staff received several threat calls, and later confirmed the same to a television channel in Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X