వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్‌ ఖాన్, యాంకర్ డ్యాన్స్ వీడియో లీక్, రెహామ్‌కు చాక్లెట్ ఇష్టం

By Srinivas
|
Google Oneindia TeluguNews

లాహోర్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ బీబీసీ వెదర్ గర్ల్ రెహామ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతను తన కొత్త భార్యతో డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో దీనిని చాలామంది చూస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న రెహామ్ ఖాన్ వయస్సు 41 ఆమె బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్. ఆమెకు గతంలో పెళ్లైంది. అనంతరం విడాకులయ్యాయి. మొదటి పెళ్లి ద్వారా ఆమెకు ముగ్గురు పిల్లలు కలిగారు. రెహామ్ ఖాన్ తొలుత సోషలైజ్ విద్యార్థిని. ఆ తర్వాత జర్నలిజంలోకి అడుగు పెట్టింది. జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూనే ఆమె తొలి ఉద్యోగం చేసింది. అనంతరం టీవీ ప్రొజెక్టర్‌గా పని చేసింది.

ఆమె బీబీసీలో వెదర్ గర్ల్‌గా పని చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ఆజ్ టీవీలో పని చేస్తోంది. 2013లో ఆమె పాకిస్తాన్‌లో తన కెరీర్ ప్రారంభించింది. రెహామ్ ఖాన్ మొదటి భర్త సైకాలజిస్ట్. రెహామ్ ఖాన్‌కు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. తిండి పట్ల మక్కువ కలిగిన వ్యక్తి. అలాగే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు అన్నా చాలా ఇష్టం.

Imran Khan's wife Reham Khan's leaked video that created furore in Pakistan

కాగా, ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్‌ఖాన్ తన రెండో వివాహానికి గల కారణాలను వెల్లడించారు. మాజీ భార్య జమిమా గోల్డ్‌స్మిత్‌ను కలిసి తన రెండో పెళ్లికి కారణాలను తెలిపారు.

62 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ తన కన్నా 20 ఏళ్లు చిన్నదైన రెహమ్ ఖాన్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. రెహమ్‌ఖాన్‌కు కూడా ఇది రెండో పెళ్లే. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ఈ రహస్య వివాహం గురించి మొదట ప్రపంచానికి వెల్లడించింది జమిమానే.

ఆయన రెండో పెళ్లిపై కుటుంబసభ్యుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో లండన్‌కు వచ్చిన ఇమ్రాన్ జమిమాను, కొడుకులను కలిసి తన రెండో పెళ్లికి కారణాలు వివరించారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు తాను బహిరంగంగానే చెప్పానని తెలిపారు.

పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి మళ్లీ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇమ్రాన్ తనతో చెప్పినట్టు జమిమా వెల్లడించారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ రెండో వివాహంపై పాకిస్థాన్‌లో పలు వర్గాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Dance video of Pakistan Tehreek-e-Insaf (PTI) chairman Imran Khan's new wife Reham Khan has been leaked. This video goes viral on social networking sites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X