వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ డిగ్రీ వివాదంలో ఇమ్రాన్ భార్య రెహామ్ ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లాహోర్: భారత్‌లో స్మృతి ఇరానీ ఫేక్ డిగ్రీ విషయమై వివాదం కొనసాగుతుండగా.. దాయాది పాకిస్తాన్‌లోను అలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. పిటిఐ పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ భార్య రెహామ్ ఖాన్ ఫేక్ డిగ్రీ వివాదంలో చిక్కుకుంది.

రెహామ్ ఖాన్‌కు బ్రాడ్ కాస్టింగ్ జర్నలిజంలో ఉన్న డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్‌ది అని బ్రిటిష్ న్యూస్ పేపర్ చెప్పింది. రెహామ్ ఖాన్ నార్త్ లిండెసి కాలేజీ నుండి డిగ్రీ చేసినట్లుగా ఉంది. కానీ అది ఫేక్ అని బ్రిటిష్ మీడియా పేర్కొంది.

Imran Khan's wife Reham Khan under fire over fake degree

అంతేకాదు, అసలు ఆ కాలేజీ ఆ కోర్సును ఎప్పుడు ఆఫర్ చేయలేదని, అంతేకాకుండా, ఆమె పేరు విశ్వవిద్యాలయ రికార్డుల్లో లేదని చెప్పింది. రెహాన్ ఖాన్ తన విద్యార్హత పైన నిజం చెప్పలేదని పేర్కొంది.

దీనిపై రెహామ్ ఖాన్ స్పందిస్తూ.. నేను డెయిలీ మెయిల్‌ను ఎందుకు చూడననేందుకు ఈ ఉదయం వచ్చిన వార్త మంచి ఉదాహరణ అని, అలాగే తాను పాకిస్తాన్‌లోని కొన్ని టీవీ చానళ్లను చూడకపోవడానికి కూడా కారణం ఇది అని ఆమె ట్వీట్ చేశారు.

English summary
Reham Khan, the wife of Pakistani politician and former cricketer Imran Khan, today came under fire after a British newspaper said that her degree in broadcast journalism was fake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X