వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

58 దేశాల మద్దతు: ఇమ్రాన్ ఖాన్ అ‘జ్ఞానం’పై సెటైర్లు, భారత్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అబద్ధాలను నిజాలుగా నమ్మించేందుకు తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో పెద్ద అబద్ధం చెప్పి తన అజ్ఞానాన్ని మరోసారి ప్రపంచానికి చాటుకున్నారు.

58 దేశాల మద్దతంటూ..

అసలు విషయమం ఏమంటే.. జెనీవాలో మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్ఆర్‌సీ) సమావేశంలో కాశ్మీర్ అంశం విషయంలో భారత నిర్ణయాన్ని 58 దేశాలు వ్యతిరేకించాయంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవంగా యూఎన్‌హెచ్ఆర్‌సీలో మొత్తం 47 దేశాలు ఉండటం గమనార్హం. ఈ మహా జ్ఞాని మాత్రం 58దేశాలంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

ధన్యవాదాలు కూడా..


జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ 58 దేశాలు పాక్‌కు మద్దతుగా నిలిచాయంటూ ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేగాక, ఆ దేశాలకు ధన్యవాదాలు కూడా తెలిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న యూరోపియన్ దేశాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో దాయాది ప్రధానికి చుక్కలు చూపారు.

ఆ 11 దేశాలు ఎక్కడివో..

ఇమ్రాన్ జీ.. ఆ జాబితాలో ఉన్న దేశాల పేర్లు చెప్పండి.. ఎవరిని పిచ్చోళ్లను చేస్తున్నారు ఈ డ్రామాలు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఇప్పటికే సైంటిస్టులు ఎక్కువగా ఉన్నారు.. ఇప్పుడు కొత్తగా ఇమ్రాన్ ఖాన్ అనే శాస్త్రవేత్త కొత్తగా 11 దేశాలను కనిపెట్టారంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తికి ఇంతటి జ్ఞానం ఉండటం విశేషమని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు గణిత పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

జాబితా ఇవ్వండి.. పాక్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు..

జాబితా ఇవ్వండి.. పాక్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు..


ఇమ్రాన్ ట్వీట్‌పై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ చురకలంటించారు. యూఎన్‌హెచ్ఆర్‌సీ సమావేశంలో పాకిస్థాన్‌ను సమర్థించిన దేశాల జాబితా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. యూఎన్‌హెచ్ఆర్‌సీలో భారత్, పాకిస్థాన్‌తో కలిపితేనే మొత్తం 47 దేశాలున్నాయని.. మరి పాకిస్థాన్‌కు 58 దేశాలు ఎలా మద్దతు తెలిపాయో చెప్పాలన్నారు. ప్రపంచానికి పాకిస్థాన్ అవాస్తవాలను చెబుతుందనడానికి ఇదే పెద్ద నిదర్శనమని రవీష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. యూఎన్‌హెచ్ఆర్‌సీ సమావేశం ఏమైనా రహస్యంగా జరిగిందా? అని ప్రశ్నించారు.

English summary
Pakistan Prime Minister Imran Khan Thursday claimed that 58 countries had joined the country in the United Nations Human Rights Council (UNHRC) against India's decision to abrogate Article 370 and end Jammu and Kashmir's special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X