వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్: వధువు ఎవరంటే.?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Cricketer Imran Khan 3rd Marriage with Spiritual guide.

ఇస్లామాబాద్: మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నారు. మత బోధనలు చేసే బుష్రా మనేకాను ఆయన పెళ్లి చేసుకున్నట్లు ధ్రువీకరించారు. గత కొంతకాలంగా ఇమ్రాన్‌ఖాన్‌, బుష్రా మనేకాల పెళ్లి విషయంపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

కాగా, లాహోర్‌లోని మనేకా సోదరుడి నివాసంలో కొద్ది మంది కుటుంబసభ్యుల మధ్య ఆదివారం వారి వివాహం జరిగినట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్‌ చౌదరి తెలిపారు. త్వరలో అతిథులతో సింపుల్‌గా వలీమా డిన్నర్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

 ఫొటోలు విడుదల చేసిన పార్టీ

ఫొటోలు విడుదల చేసిన పార్టీ

పీటీఐ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు ముఫ్తీ ముహమ్మద్‌ సయీద్‌ వారి నిఖా జరిపించారు. పీటీఐ పార్టీకి చెందిన మీడియా విభాగం వారి పెళ్లి ఫొటోను విడుదల చేసింది. కాగా, గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నారు.

 ఇద్దరు భార్యకుల విడాకులు

ఇద్దరు భార్యకుల విడాకులు

తొలిసారి 1995లో బ్రిటిష్‌కు చెందిన బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్లు వీళ్లు కలిసి ఉన్నారు. జెమీమాకు ఇద్దరు కుమారులు. ఆ తర్వాత 2015లో టీవీ యాంకర్‌ రెహామ్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరు కేవలం పది నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు.

పెద్దల ఒత్తిడితో..

పెద్దల ఒత్తిడితో..

కాగా, ఇమ్రాన్‌ఖాన్‌, బుష్రా మనేకాను జనవరి ఒకటో తేదీన వివాహం చేసుకున్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. ఖాన్‌ వీటిని ఖండించారు. కానీ, గత కొన్ని రోజులుగా ఈ విషయమై వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ పుకార్ల ప్రభావం పార్టీపై పడుతోందని పలువురు అభిప్రాయపడటటం, తమ వివాహాన్ని అధికారికంగా తెలియజేయాలని ఇమ్రాన్‌కు పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇమ్రాన్ ఖాన్.. మనేకాను వివాహం చేసుకుని అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.

 పుకార్లకు తెరదించుతూ..

పుకార్లకు తెరదించుతూ..

మనేకా వయసు సుమారు 40ఏళ్లకు పైనే ఉంటుంది. కాగా, ఆమెకు మొదటి భర్తతో ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మతబోధకురాలుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇమ్రాన్ ఖాన్‌ గత ఏడాది కాలంగా ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు కోసం ఆమె వద్దకు వెళ్తున్నారు. ఖాన్‌ విషయంలో రాజకీయపరంగా ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయట. కాగా, గత నెలలోనే మనేకా తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలో తాను బుష్రాను పెళ్లి చేసుకుంటానని అడిగానని గత నెలలోనే ఇమ్రాన్‌ వెల్లడించారు. చివరకు పుకార్లకు స్వస్తి పలుకుతూ ఆమెతో మూడో వివాహం చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్.

English summary
Pakistan Tehreek-e-Insaf (PTI) chief Imran Khan has married spiritual guide Bushra Maneka, his party confirmed on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X