వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సోకిన వ్యక్తితో కరచాలనం: క్వారంటైన్లోకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ధనిక పేద తేడా లేకుండా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పలు దేశ ప్రధానులు, మంత్రులు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా కరోనా సోకిన వ్యక్తిని కలవడంతో క్వారంటైన్లోకి వెళ్లారు.

ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!

పాకిస్థాన్ దేశంలో ప్రముఖ చారిటీ గ్రూప్‌లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్
ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ కింద రూ. కోటి చెక్కు ఇచ్చేందుకు గతవారం ఫైజల్.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామబాద్ వచ్చి ఇమ్రాన్ ఖాన్‌కు ఆ చెక్కును స్వయంగా అందించారు.
చెక్కు అందజేస్తూ ఫొటో కూడా దిగారు.

 Imran Khan to Undergo Test Days After Meeting Philanthropist Who Tested Corona Positive

కాగా, ఫైజల్ ఈధీకి కరోనా సోకడంతో ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఫైజల్ ఈధీకి దగ్గరగా మెలిగిన వారందరికీ కరోనా పరీక్షలు జరుగుతున్నాయని ఈధీ కుమారుడు సాద్ తెలిపారు. ఈధీ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పాకిస్థాన్ లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కరోనా సోకిన వారికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈధీకి కూడా కరోనా సోకిందని ఫౌండేషన్ తెలిపింది.

ఈధీకి కరోనా సోకిన నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేగాక, కొన్ని రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని పాకిస్థాన్ లో కొవిడ్ కేసులను పర్యవేక్షిస్తున్న డాక్టర్ ఫైసల్ సుల్తాన్ ప్రధానికి స్పష్టం చేశారు.
కరోనా టెస్ట్ చేయించుకోవాలా? వద్దా? అనేది ప్రధాని ఇష్టమని ఆయన చెప్పారు. కాగా, ఓవైపు కరోనా వ్యాపిస్తుంటే.. దేశంలో రంజాన్ వేడుకలు జరుపుకోవచ్చంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ఆదేశాలు జారీచేయడం గమనార్హం. పాకిస్థాన్ లో ఇప్పటి వరకు 9214 కరోనా కేసులు నమోదవగా, 192 మంది చనిపోయారు.

English summary
Imran Khan has agreed to get tested for the novel coronavirus after a well-known philanthropist was tested positive for the COVID-19, days after meeting the Pakistan prime minister, his doctor said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X