వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతి చర్చలకు మేం సిద్ధం: నరేంద్ర మోడీకి ఇమ్రాన్ ఖాన్ లేఖ

|
Google Oneindia TeluguNews

కరాచీ: భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. తీవ్రవాదం, రెండు దేశాల మధ్య శాంతి తదితర అంశాలపై చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధమని ప్రకటించారు. అయితే ఓ వైపు సరిహద్దుల్లో సైన్యాన్ని దారుణంగా చంపుతూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ పాకిస్తాన్ శాంతి అంటూ లేఖలు రాయడం గమనార్హం.

దటీజ్ శివరాజ్.. పదేళ్ల తర్వాతా బీజేపీకే క్రేజ్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపు కష్టమే!దటీజ్ శివరాజ్.. పదేళ్ల తర్వాతా బీజేపీకే క్రేజ్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపు కష్టమే!

ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరగాలని ఇమ్రాన్ ఖాన్ ఈ లేఖను మోడీకి రాశారు. ఈ నెల చివరలో జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ సందర్భంగా ఈ సమావేశం ఉండాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Imran Khan writes to PM Modi, calls for resumption of peace dialogue

గత నెలలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి అధికారిక ప్రతిపాదన. భారత్ - పాక్ మధ్య నిర్మాణాత్మక సంబంధాల కోసం భారత్ ఎదురు చూస్తోందని ప్రధాని మోడీ ఆగస్ట్ 20న లేఖ రాశారు. దానికి ఇమ్రాన్ సమాధానం ఇచ్చారు.

భారత్ పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలకు కట్టుబడి ఉందని మోడీ అందులో ప్రస్తావించారు. రెండు దేశాలు అంగీకరిస్తే యూఎన్ సమావేశంతో పాటు విదేశాంగ మంత్రుల సమావేశం కూడా జరిగే అవకాశముంది. ఈ విషయమై చర్చిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.

English summary
Pakistan Prime Minister Imran Khan has written to Prime Minister Narendra Modi asking that India and Pakistan resume dialogue that has been suspended since 2015. In the letter addressing the PM as "Modi Sahab", Imran Khan also suggests a meeting between the foreign ministers of the two countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X