వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NASA:అంగారక గ్రహంపై నుంచి భూమికి రాతి నమూనాలు.. ఇదిగో పూర్తి వివరాలు..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ఓ భారీ ప్రయత్నానికి తెరతీయనుంది. అంగారకుడిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు వీలుగా ఆ గ్రహం నుంచి రాతి నమూనాలను భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని నవంబర్ 10న విడుదల చేసిన రివ్యూ రిపోర్టులో నాసా పేర్కొంది. ఇందుకోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో జతకట్టడంతో పాటు రివ్యూ బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు నాసా పేర్కొంది. తన ప్రతిపాదనలను బోర్డు ముందు ఉంచగా అనుకున్న ప్రణాళికతో నాసా ముందుకెళ్లేందుకు రివ్యూ బోర్డు ఆమోద ముద్ర వేసింది.

అంగారక గ్రహం నుంచి రాతి నమూనాలను భూమికి తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా నాసా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తన ప్రయోగాలపై ప్రణాళికపై ప్రయత్నాలపై సంతృప్తి చెందిన ఇండిపెండెంట్ రివ్యూ బోర్డు... మార్స్ శాంపిల్ రిటర్న్ అనే ఈ కార్యక్రమం నిర్వహించేందుకు నాసాకు అన్ని అర్హతలున్నాయని పేర్కొంటూ ఏకపక్షంగా ఆమోద ముద్ర వేసింది. అంగారకుడిపై రోబోలను నాసా వినియోగించనున్నట్లు రివ్యూ బోర్డు పేర్కొంది.

In a first of its kind, NASA to collect samples from Mars and get to earth for scientists to study

Recommended Video

Andhra Pradesh : కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఊపందుకున్న పునర్విభజన ప్రక్రియ!

అంగారక గ్రహంపై రోబో ల్యాండ్ అయి అక్కడి రాతి నమూనాలను సేకరిస్తుంది. అంతేకాదు రోబోకు జతచేసిన డ్రిల్లింగ్ మెషీన్ ఉపయోగించి మట్టని కూడా భూమికి తీసుకువచ్చే ఏర్పాట్లను నాసా చేస్తోంది. ఈ నమూనాలను సేకరించి వాటిని ట్యూబ్‌లలో రోబో భద్రపరుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను శాంపిల్ కాషింగ్‌‌గా పిలుస్తామని నాసా వెల్లడించింది. ఇక అంతరిక్షంలోకి తొలిసారిగా డ్రిల్, శాంపిల్ ట్యూబలతో కూడిన హార్డ్‌వేర్ వ్యవస్థను పంపనున్నట్లు నాసా స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసుకుని 2030 నాటికల్లా భూమికి చేరుకుంటుందని నాసా తెలిపింది.

ఇక అంగారకుడిపై రాతి, మట్టి నమూనాలు పరిశీలించి ఆ గ్రహంపై జీవరాశులు ఉండేందుకు అనుకూలమా లేక గతంలో ఎప్పుడైనా ఉండేవా అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. ఈ పరిశోధనల ద్వారా ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు... మనిషిని అంగారక గ్రహంకు పంపాలన్న తమ కల కూడా సాకారం అయ్యేందుకు ఉపయోగపడుతుందని నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జర్‌బుచెన్ వాషింగ్టన్‌లో చెప్పారు.

English summary
In a first of its kind NASA is planning to get the rock samples from Mars for scientists to study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X