• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాస్క్‌తో ట్రంప్: ఫస్ట్‌ టైమ్: బెదురుతోన్న అమెరికా..అతలాకుతలం: ఒక్కరోజే 66 వేలకు పైగా

|

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ చెలరేగుతోంది. భయానకంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ బలపడుతోంది. గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనితోపాటు కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్యలోనూ అసాధారణ పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఇప్పటికే అమెరికాలో 1,37,403 మంది మరణించారు. 33 లక్షలమందికి పైగా అమెరికన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే అమెరికా అల్లకల్లోలానికి గురైంది. ఆర్థికంగా కుదేల్ అయింది. కరోనా వల్ల ప్రపంచంలో మరే దేశం కూడా అమెరికా స్థాయిలో ప్రాణనష్టాన్ని చవి చూడలేదు.

చైనా వివాదం ముదిరితే భారత్ కు ట్రంప్ హ్యాండ్‌ ? అమెరికా మాజీ భద్రతా సలహాదారు సంచలనం...చైనా వివాదం ముదిరితే భారత్ కు ట్రంప్ హ్యాండ్‌ ? అమెరికా మాజీ భద్రతా సలహాదారు సంచలనం...

తొలిసారిగా మాస్క్‌తో ట్రంప్..

తొలిసారిగా మాస్క్‌తో ట్రంప్..

అమెరికాలో ఈ మహమ్మారి వల్ల నెలకొన్న అసాధారణ పరిస్థితులు అక్కడి పాలకులను భయపెడుతున్నాయి. ఇప్పటిదాకా మాస్క్‌ను ధరించడానికి పెద్దగా ఇష్టపడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతానికి భిన్నంగా వ్యవహరించారు. మాస్క్‌తో కనిపించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. ట్రంప్ మాస్క్‌తో కనిపించడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఆయన ఎప్పుడూ బహిరంగంగా మాస్క్‌ను ధరించలేదు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ధరించక తప్పని పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నారు.

మెడికల్ సెంటర్ సందర్శన సందర్భంగా..

మెడికల్ సెంటర్ సందర్శన సందర్భంగా..

వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్ రీడ్ జాతీయ మిలటరీ మెడికల్ సెంటర్‌ను సందర్శించడానికి తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వెళ్లడానికి ముందు డొనాల్డ్ ట్రంప్..మాస్క్ ధరించారు. నలుపురంగు మాస్క్‌ను ధరించి కనిపించారు. వైట్‌హౌస్‌ను వీడటానికి ముందు ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. తాను మాస్క్‌ను ధరించడానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇన్ని ఆ అవసరం రాలేదని చెప్పారు. ప్రస్తుతం తాను సందర్శించబోతోన్నది ఓ మెడికల్ సెంటర్ కావడం వల్ల మాస్క్‌ను ధరించినట్లు చెప్పుకొచ్చారు ట్రంప్.

ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పరామర్శ కోసం

ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పరామర్శ కోసం

మేరీలాండ్‌లోని బేతెస్ద మెడికల్ ఫెసిలిటీ సెంటర్‌ను కూడా సందర్శించబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి పోరాడుతోన్న ఫ్రంట్‌లైన్ వర్కర్లను పరామర్శిస్తానని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతానని అన్నారు. ఇదిలావుండగా.. అమెరికాలో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట పడట్లేదు. బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. ఒక్కరోజే 66,528 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి. న్యూయార్క్‌లో అత్యథికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 4,26,807 కేసులు వెలుగులోకి వచ్చాయి. 32,393 మంది అక్కడ మరణించారు.

  Trump Again Blames China For COVID-19, Terms It ‘Kung Flu
  కరోనా బారిన అమెరికన్ నగరాలు..

  కరోనా బారిన అమెరికన్ నగరాలు..

  న్యూయార్క్్ తరువాత.. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, అరిజోనా, జార్జియా, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, లూసియానాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. న్యూయార్క్ జంట నగరం న్యూజెర్సీలో 15,603 మంది మరణించారు. న్యూయార్క్ తరువాత అత్యధిక మరణాలను నమోదు చేసిన నగరం ఇదే. కాలిఫోర్నియాలో 7,026 మంది కరోనా వల్ల మృతిచెందారు. కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాలు అన్ని నగరాల్లోనూ నమోదు అవుతున్నాయి. ఈ విషయం ట్రంప్ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.

  English summary
  In a first since the beginning of the coronavirus pandemic, US President Donald Trump was spotted wearing a mask on Saturday. Trump who had for months declined to wear a face mask in public was seen donning a dark coloured face mask during his visit to Walter Reed to see wounded military members, The Hill reported. This comes as the US is ravaged with coronavirus pandemic which has claimed over 1,37,403 lives.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X