వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో బాంబు పేల్చిన ట్రంప్ సర్కార్: అలాంటి వారికి గ్రీన్ కార్డు రద్దు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. అమెరికాకు కొన్నేళ్ల కిందట వచ్చి స్థిరపడిన వలసదారులకు గ్రీన్ కార్డు ఇచ్చేందుకు నిరాకరించింది. అమెరికాలో స్థిరపడిన ఆదేశ ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారికి గ్రీన్‌కార్డు ఇచ్చేది లేదంటూ తాజా ఆదేశాలు ట్రంప్ సర్కార్ జారీ చేసింది. ముఖ్యంగా ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన ఫుడ్ స్టాంప్స్, వైద్యసేవలు, ఇతర ప్రజాపంపిణీ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందే వలసదారులకు గ్రీన్ కార్డు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పింది. ఇక ట్రంప్ సర్కార్ నిర్ణయంతో కొన్ని లక్షల మంది వలసదారుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం ఎక్కువగా హిస్పానిక్ వలసదారులపై పడనుంది. వారు చాలా తక్కువ వేతనంకు పనిచేస్తూ అమెరికా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు.

అమెరికాలో చట్టబద్ధంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తూ ప్రస్తుతం దేశం వెలుపల ఉన్న పేద మరియు తక్కువ నైపుణ్యం గల వలసదారుల ఆశలపై ట్రంప్ సర్కార్ నిర్ణయంతోనీళ్లు చల్లినట్లయ్యింది. ఒకవేళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోరుతూ అమెరికా దేశంలో నివాసం ఉండాలంటే అది చెల్లదని అలాంటి వారిని అమెరికాలో ఉండనిచ్చేది లేదని కొత్త నిర్వచనం ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. ఇక ఇప్పటికే గ్రీన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటున్న వారిని గుర్తించి వారి గ్రీన్ కార్డు రద్దు చేస్తామని పేర్కొంది.

In a Fresh move Trump administration denies Green cards to immigrants

నిజమైన అమెరికా పౌరులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే.. అమెరికాలో స్థిరపడే వలసదారులు ఆర్థికంగా నిలదొక్కుకుని ఉండాలని ట్రంప్ చెప్పినట్లుగా వైట్‌హౌజ్ ప్రకటన విడుదల చేసింది. ఇక చాలామంది వలసదారులు ఇప్పటికే తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలితాలతో లబ్దిపొందారని ఇదిలానే కొనసాగితే అమెరికా పౌరులు అన్యాయానికి గురవుతారని వెల్లడించింది. ఇక తాజా ఆదేశాలు 22 మిలియన్ వలసదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక సగానికి పైగా వలసదారుల్లో ప్రతి కుటుంబం నుంచి ఒకరు ప్రభుత్వం అందించే వైద్యసేవలు వినియోగించుకుంటున్నారని వైట్ హౌజ్ పేర్కొంది. 78శాతం గృహాల్లో ఉంటున్న వలసదారులు కనీసం హైస్కూల్ విద్యను కూడా అభ్యసించకుండానే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని అధికారులు తెలిపారు.

English summary
Immigrant who are getting benifitted from Government schemes will be denie the Green card that assues the US citizen ship, said Trum administration. With this fres move about 22 million immigrants would be affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X