వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైవేలో కార్ల మీదకు దూసుకెళ్లిన విమానం, పరుగో పరుగు, మొన్న మాస్కోలో!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: గాల్లోకి ఎగిరిన ఓ చిన్న విమానం నిమిషాల్లో హైవే మీదకు దూసుకెళ్లి అడ్డంగా వచ్చిన కార్లను ఢీకొనింది. అమెరికాలోని మేరిల్యాండ్ లో జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అధికారులు మాత్రం విమానం ఢీకొనడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు. హైవే మీద విమానం ల్యాండ్ అయిన వీడియో వైరల్ అయ్యింది. మొన్న మాస్కోలో ఇలాగే గడ్డివాము మీద విమానం ల్యాండ్ అయ్యింది.

ఢిల్లీలో తిరుమల లడ్డూలు పంచిన డీకే ఫ్యాన్స్, దేవుడే కాపాడాలి, బెయిల్ కోసం, తుగ్లక్!ఢిల్లీలో తిరుమల లడ్డూలు పంచిన డీకే ఫ్యాన్స్, దేవుడే కాపాడాలి, బెయిల్ కోసం, తుగ్లక్!

ప్రైవేట్ కంపెనీ సంస్థకు చెందిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన (టేకాఫ్) కొంత సేపటికి సాంకేతిక లోపం కారణంగా హైవే మీదకు దూసుకు వచ్చిందని పోలీసులు అంటున్నారు. హైవే మీద వెలుతున్న కొన్ని కార్లను ఈ చిన్న విమానం ఢీకొనిందని పోలీసులు చెప్పారు.

In a Shocking incident a small crashed after take off and struck a car in Maryland, America.

విమానం హైవే మీదకు దూసుకు వచ్చిన సమయంలో కార్లలో ఉన్న వారు, స్థానికులు ఆందోళనతో పరుగు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సాదారణంగా ఇలాంటి లఘు విమానాలు కుప్పకూలిన సమయంలో కేసు నమోదు చేసి ప్రమాదం ఎలా జరిగింది అని విచారణ చేస్తామని మేరిల్యాండ్ పోలీసులు తెలిపారు.

ఆదాని కంపెనీకి నీకు ఏం సంబంధం ఐశ్వర్య, డీకే కూతురుకు ఈడీ ప్రశ్నలు, ఉషా ఆస్తి!ఆదాని కంపెనీకి నీకు ఏం సంబంధం ఐశ్వర్య, డీకే కూతురుకు ఈడీ ప్రశ్నలు, ఉషా ఆస్తి!

ఇటీవల రష్యాలోని మాస్కోలో విమానం గాల్లోకి ఎగిరిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలెట్ సమయస్పూర్తితో విమానాన్ని సమీపంలోని పోలంలో ఉన్న జోన్నల గడ్డివాము మీద ల్యాండ్ చెయ్యడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గడ్డివాము మీద విమానం ల్యాండ్ కావడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని మాస్కో అధికారులు తెలిపారు.

English summary
America: In a Shocking incident a small crashed after takeoff and struck a car in Maryloand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X