వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ జాంగ్ ఊహాతీత నిర్ణయం.. యుద్ధంపై అధికారిక ప్రకటన.. చెల్లెలిపై కోపమా.. బతికే ఉన్నాడా?

|
Google Oneindia TeluguNews

అణుబాంబులతో ఆటలు ఆయనకు కొత్తేమీకాదు.. రోజుకో కొత్తరకం మిస్సైల్ ను పరీక్షిస్తూ శత్రుదేశాల గుండెల్లో నిత్యం గుబులుపుట్టిస్తూనే ఉంటాడు.. తన జోలికొస్తే అందర్నీ ఖతం చేస్తానని బెదిరిస్తాడు.. అ మేరకు రెండు వారాల కిందటే దక్షిణ కొరియాపై సైనిక చర్యకు ఉపక్రమించాడు.. ముందుగా డీమిలటరైజ్డ్ జోన్ లోని అనుసంధాన కార్యాలయాన్ని పేల్చిపారేశాడు.. పూర్తి స్థాయి యుద్ధానికి సంకేతంగా సరిహద్దు వెంబడి భారీగా సైన్యాలను సైతం మోహరింపజేశాడు.. కానీ.. కిరాతకం విషయంలో ఏనాడూ వెనక్కి తగ్గని కిమ్ తొలిసారి ఊహాతీత నిర్ణయం తీసుకున్నాడు..

Recommended Video

Kim Jong-un అనూహ్య నిర్ణయం.. యుద్దం తప్పదనుకుంటున్న తరుణంలో ఇలా ! || Oneindia Telugu

 కిమ్ జాంగ్ రివర్స్ రణనీతి.. శత్రువు ఆయుధాలతోనే ఎదురుదాడి.. సౌత్‌పైకి బెలూన్ బాంబులు.. కిమ్ జాంగ్ రివర్స్ రణనీతి.. శత్రువు ఆయుధాలతోనే ఎదురుదాడి.. సౌత్‌పైకి బెలూన్ బాంబులు..

కరపత్రాల వివాదం..

కరపత్రాల వివాదం..

నార్త, సౌత్ కొరియాల మధ్య కొంత కాలంగా కరపత్రాల వివాదం కొనసాగుతుండటం తెలిసిందే. కిమ్ నియంతృత్వాన్ని ఖండిస్తూ, ప్రజలంతా ఆయనపై తిరగబడాలని రాసున్న లక్షల కొద్దీ కరపత్రాలు సౌత్ బోర్డర్ నుంచి వచ్చిపడ్డాయి. సౌత్ లో ఆశ్రయం పొందుతోన్న నార్త్ కొరియా ఫిరాయింపుదారులు.. గ్యాస్ బెలూన్ల ద్వారా ఈ కరపత్రాలను పంపుతున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన నియంత నేత సోదరి కిమ్ యో జాంగ్.. ఫిరాయింపుదారులు, వాళ్లకు ఆశ్రయమిస్తోన్న సౌత్ కొరియాపై సైనిక చర్యలకు ఆదేశించారు. అందులో భాగంగా, రెండు దేశాల సరిహద్దుల్లోని అనుసంధాన కార్యాలయాన్ని పేల్చేయడంతోపాటు బోర్డర్ లో సాయుధ బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో అధినేత కిమ్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

అనూహ్య ప్రకటన..

అనూహ్య ప్రకటన..

వరుస పరిణామాలతో టెన్షన్ విపరీతంగా పెరిగిపోయిన వేళ.. సౌత్ కొరియాపై సైనిక చర్యను నిలిపేస్తూ కిమ్ జాంగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యుద్దం తప్పదనుకుంటున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా కిమ్ వెనక్కి తగ్గడమేకాదు.. సౌత్ తో సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగానూ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ)' బుధవారం కీలక ప్రకటనలు చేసింది. ‘‘సౌత్ సరిహద్దులో ప్రస్తుత పరిస్థితిపై సెంట్రల్ మిలటరీ కమిషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ తర్వాత అధినేత ఈ మేరకు నిర్ణయించారు''అని కేసీఎన్ఏ తెలిపింది.

చైనా బందీలుగా భారత జవాన్లు.. గాల్వాన్ లోయలో హింస తర్వాత భయానక మైండ్ గేమ్.. ఇప్పుడు మైదానంలో..చైనా బందీలుగా భారత జవాన్లు.. గాల్వాన్ లోయలో హింస తర్వాత భయానక మైండ్ గేమ్.. ఇప్పుడు మైదానంలో..

సైన్యం వెనక్కి.. స్పీకర్లు తొలగింపు..

సైన్యం వెనక్కి.. స్పీకర్లు తొలగింపు..


సోదరి కిమ్ యో జాంగ్ ఆదేశాల మేరకు సౌత్ సరిహద్దులో భారీగా మోహరించిన నార్త్ బలగాలు.. బుధవారం నాటి సుప్రీం కమాండర్ ఆదేశాల మేరకు అక్కణ్నుంచి వెనుదిరిగాయి. అంతేకాదు, సౌత్ నుంచి వచ్చే సందేశాలు వినపడకుండా బోర్డర్ అంతటా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను కూడా ఉత్తర కొరియా తొలగించింది. రెండు దేశాల మధ్య అనుసంధాన బిల్డింగ్ ను పేల్చేయడంపై కిమ్ సారీ చెప్పనప్పటికీ.. సౌత్ కొరియాతో మునుపటి సంబంధాలనే కోరుతున్నట్లు సంకేతాలు పంపారు.

గుడ్ కాప్.. బ్యాడ్ కాప్..

గుడ్ కాప్.. బ్యాడ్ కాప్..

భవంతిని పేల్చేసి, బోర్డర్ లో సైనికుల్ని మోహరించిన తర్వాత కూడా సౌత్ కొరియా నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో కిమ్ డంగయ్యాడని, సౌత్ కొరియాపై సైనిక చర్యకు ఆదేశాలివ్వడంలో చెల్లెలు కిమ్ యో జాంగ్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని ఆమెపై నియంత నేత ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా రిపోర్టులు వచ్చాయి. అయితే, ప్రపంచ ప్రఖ్యాత అనలిస్టులు మాత్రం దీన్ని.. చెల్లెలితో కలిసి కిమ్ ఆడుతున్న కొత్త నాటకంగా అభివర్ణించారు. ‘గుడ్ కాప్.. బ్యాడ్ కాప్' కథలాగా.. చెల్లెలు కిమ్ యో ‘చెడ్డ పోలీసు'లాగా దుందుడుకు ప్రకటనలు చేస్తూ, దాడులకు సైతం వెనుకాడబోనని అంటుంటే.. కిమ్ జాంగ్ ‘మంచి పోలీసు'లాగా పరిస్థితిని చక్కబెట్టే పాత్ర పోషిస్తున్నాడని, చెల్లెల్ని మరింత బలోపేతం చేసే దిశగానే కిమ్ అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోందని అనలిస్టులు పేర్కొన్నారు.

డెత్ మిస్టరీపై ఆగని రూమర్లు..

డెత్ మిస్టరీపై ఆగని రూమర్లు..

ఊబకాయం, స్మోకింగ్ తదితర కారణాలతో కిమ్ జాంగ్ గుండె చెడిపోయిందని, ఆపరేషన్ వికటించడంతో ఆయన చనిపోయారంటూ కొద్ది నెలల కిందట విపరీతమైన ప్రచారం జరిగింది. దాదాపు మూడు వారాల తర్వాతగానీ నియంత నేత ప్రజల ముందుకు రాలేదు. అయితే ఆ సమయంలో, ఒంటిపై ఉన్న గాయాలు, ముఖం, శరీరంలో చోటుచేసుకున్న మార్పులను బట్టి అతను కిమ్ బాడీ డూప్ అయి ఉంటాడని, అసలు వ్యక్తి చనిపోయే ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కిమ్ స్థానాన్ని భర్తీ చేసేందుకే చెల్లెలు కిమ్ యో జాంగ్ సౌత్ కొరియాపై సైనిక చర్యకు ఆదేశించారని, అన్న కంటే డేంజరస్ అని భారీగా ప్రచారం లభించిన తర్వాత సదరు ఆదేశాలను ఉపసంహరించుకున్నారంటూ ఉత్తరకొరియా వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.

కొరియా యుద్ధానికి 70 ఏళ్లు..

కొరియా యుద్ధానికి 70 ఏళ్లు..


ఉత్తర,దక్షిణ కొరియాలు విడిపోడానికి కారణమైన యుద్ధం సంభవించి బుధవారంతో 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1950లో ప్రారంభమైన కొరియా యుద్ధం 1953 జులై 27న ముగిసింది. ఆ యుద్ధంలో దక్షిణకొరియాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. చివరికి అమెరికా, ఉత్తర కొరియా మధ్య అంగీకారం మేరకు యుద్ధం ముగిసినా.. శాంతి ఒప్పందం మాత్రం ఇప్పటిదాకా కుదరలేదు. అందుకే కిమ్ తరచూ యుద్ధ భాషలో మాట్లాడుతుంటారు. వార్ యానివర్సనీ నేపథ్యంలోనే సెంట్రల్ మిలటరీ కమిషన్ తో భేటీ అయిన కిమ్.. సౌత్ పై సైనిక చర్యల ఆదేశాలను ఉపసంహరించుకున్నారు.

English summary
North Korea has suspended plans for "military action" against South Korea, according to state media. Recent weeks saw a rising tide of angry rhetoric from the North over activist plans to send leaflets with anti-North Korean messages over the border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X