వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో డేటింగ్ కోర్సు: థియరీ, ప్రాక్టికల్స్, ఆన్‌లైన్‌లో శిక్షణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో విద్యార్థుల కోసం ఓ కొత్త కోర్సును ప్రవేశపెట్టారు.ప్రేయసి, ప్రియుడు లేని వారి కోసం డేటింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కోర్సు చేసినవారిలో 90 శాతం మందికి తోడు దొరికిందంటున్నారు.

వినూత్న ఆలోచనలతో చైనీయులు ముందుంటారు. అయితే చైనీయుల కొత్త విద్యావిధానం మాత్రం వింతగా అనిపిస్తోంది.తోడు కోసం ఈ కోర్సును క్రియేట్ చేశారు. అయితే ఈ కోర్సు చేసిన వారికి తోడు దొరికిందని వారు సంతోషంగా ప్రకటిస్తున్నారు.

ఇండియాలో ఇంజనీరింగ్ , మెడిసిన్ చదివినట్టుగానే డేటింగ్ కోర్సు కూడ చైనా యువత కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ కోర్సులో ఎక్కువ మంది చేరుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

 చైనాలో డేటింగ్ కోర్సు

చైనాలో డేటింగ్ కోర్సు

చైనాలో విద్యార్థుల కోసం డేటింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రేయసి, ప్రియుడు లేనివారికోసం డేటింగ్ కోర్సును ప్రారంభించారు. ఈకోర్సు చేసిన వారిలో 90శాతం మందికి జీవిత భాగస్వాములు దొరికారు. ప్రియుడు, ప్రియురాలితో ఎలా ఉండాలనే విషయాలతో పాటు పలు అంశాలపై ఈ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ మంచి ఫలితాలను ఇచ్చిందంటున్నారు స్థానిక యువకులు.

 ప్రేమలో ఫెయిల్.. డేటింగ్ కోర్సు

ప్రేమలో ఫెయిల్.. డేటింగ్ కోర్సు

చైనాకు చెందిన ఝాంగ్‌ మైండాంగ్‌ అనే వ్యక్తి 2012లో ప్రేమలో విఫలయ్యాడు. ఆ బాధ నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలే చేశాడు. అయితే తిరిగి ప్రేమలో పడితేనే కోలుకోగలడు భావించాడు. ప్రేయసి లేదా ప్రియుడు కోసం వెతుక్కొనే వారికి ఓ ప్రత్యేక కోర్సు ప్రారంభించాలని భావించాడు. ఇందుకోసం 2014లో తూర్పు చైనాలోని జినాన్‌ నగరంలో ఝాంగ్‌ మైండాంగ్‌ ప్రత్యేకంగా పాఠశాల ప్రారంభించాడు. ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నాడు.ఈ కోర్సుకు చైనాలో మంచి డిమాండ్ ఏర్పడింది.

 అభిరుచులకు అనుగుణంగానే

అభిరుచులకు అనుగుణంగానే

ఈ కోర్సులో చేరిన వారి అభిరుచులకు అనుగుణంగా ప్రియుడు లేదా ప్రియురాలి వివరాలను అందిస్తారు. కోర్సులో చేరగానే వారి జీవనశైలిని మార్చుతారు. గతంలో పనిచేసినట్టుగా లేకుండా మార్పులు చేర్పులు చేసేలా కోర్సును డిజైన్ చేశారు.ఇద్దరికీ నచ్చితే లాంగ్‌ రిలేషన్‌ ఏర్పడే విధంగా శిక్షణ ఇస్తారు.

థియరీ, ప్రాక్టికల్ సెషన్స్

థియరీ, ప్రాక్టికల్ సెషన్స్

ఈ కోర్సులో చేరిన వారి కోసం థియరీ క్లాసులతో పాటు, ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి. సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ ఫోటోల కోసం ఫోటో సెషన్లు, సెల్ఫీ క్లాసులు, ప్రత్యేకంగా ఉంటాయి. 'ఫాల్‌ ఇన్‌ లవ్‌ ఎమోషనల్‌ ఎడ్యుకేషన్‌' పేరుతో ప్రారంభించిన ఈపాఠశాలలో ఇప్పుడు 300 మంది శిక్షణ తీసుకుంటున్నారు.

 ఆన్‌లైన్ శిక్షణకు 45 డాలర్లు

ఆన్‌లైన్ శిక్షణకు 45 డాలర్లు

ఆన్‌లైన్‌ తరగతుల కోసం 45 డాలర్లతో తక్కువ ప్యాకేజీ ఉంటుంది. కోర్సును బట్టి ఫీజు పెరుగుతోంది. తక్కువలో తక్కువగా 45 డాలర్లను చార్జీ చేస్తారు.మరో వైపు ఒక్కొక్కరికి పర్సనల్‌గా ఈ క్లాసులు చెప్పడానికి మూడు వేల డాలర్లు ఫీజుగా తీసుకుంటారు.

English summary
Zhang Zhenxiao is 27 years old. He has never been in a relationship. He has never kissed a woman.Now, Mr. Zhang is ready for love — but like many men in China, he doesn’t know where to begin.So Mr. Zhang turned to a dating coach. The “Fall in Love Emotional Education” school, which caters to straight men, has taught him how to groom himself, approach a woman and flirt his way into her smartphone contacts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X