వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విధ్వంసం వేళ అమెరికా రక్షణశాఖ సంచలనం: అంతుచిక్కని యుఎఫ్‌ఓల వీడియోలతో..

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్న వేళ.. ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యుఎఫ్ఓ)లకు సంబంధించిన మూడు వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. ఇన్నేళ్లుగా యుఎఫ్ఓలకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నయినా పెద్దగా పట్టించుకోలేదు పెంటగాన్. యుఎఫ్ఓలకు సంబంధించిన వార్తలన్నింటినీ కొట్టి పారేస్తూ వచ్చింది. యుఎఫ్ఓలనేవి లేవని వాదిస్తూ వచ్చింది.

యుఎఫ్ఓలపై అలాంటి వైఖరిని ఇన్నాళ్లూ అనుసరిస్తూ వచ్చిన పెంటగాన్ అధికారులు ఉన్నట్టుండి ఈ వీడియోలను విడుదల చేయడం, అదీ కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న సమయంలో కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం మూడు వీడియోలను అధికారికంగా విడుదల చేశారు పెంటగాన్ అధికారులు. 2004 నవంబర్‌లో ఒకటి, 2015 జనవరిలో రెండు వేర్వేరు సందర్భాలు చిత్రీకరించిన మూడు వీడియోలనూ ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

అమెరికా వైమానిక దళ జవాన్లు యథాలాపంగా చిత్రీకరించారు ఈ యూఎఫ్ఓలను. సముద్ర జలాల్లో పహారా కాస్తున్న సమయంలో ఆకాశాంలో కనిపించిన వింత ప్రకాశాన్ని చిత్రీకరించిన సమయంలో ఈ యూఎఫ్ఓలు రికార్డు అయ్యాయి. అత్యాధునికమైన కెమెరాలతో వాటిని చిత్రీకరించారు జవాన్లు. యుఎఫ్ఓ కదలికలు ఇందులో స్పష్టంగా నమోదు అయ్యాయి. 2004లో సదరన్ కాలిఫోర్నియాలో సమీపంలో గగనతలంలో మొట్టమొదటి వీడియోను తీశారు. ఇందులో యుఎఫ్ఓ కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి.

In Covid-19 pandemic Pentagon releases ‘UFO’ videos officially

2015 జనవరిలో అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఎఫ్-18 యుద్ధ విమానం ద్వారా జవాన్లు గస్తీలో ఉన్న సమయంలో ఈ యుఎఫ్ఓ కనిపించింది. అదేనెలలోనే రెండోసారి కూడా యుఎఫ్ఓ కనిపించడంతో దాన్ని రికార్డు చేశారు. ఫ్లయింగ్ సాసర్ రూపంలో ఉన్న వస్తువు గాల్లో శరవేగంగా దూసుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో స్పష్టంగా నమోదైంది. ఈ వీడియోల పట్ల అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఏనాడు పెద్దగా శ్రద్ధ చూపించలేదు. చూసీ చూడనట్లుగానే వ్యవహరించింది. 2019 కన్సాస్ సిటీ సమీపంలో ఆకాశంలో మరోసారి ఇలాంటి వస్తువే కనిపించిన సమయంలో కూడా దాని మీద పెద్దగా దృష్టి సారించలేదు.

Recommended Video

Bill Gates Defends China, Blames American Government

తాజాగా కరోనా వైరస్ వేలాదిమందిని పొట్టనబెట్టుకుంటోన్న వేళ పెంటగాన్ అధికారులు ఈ మూడింటినీ ఒకేసారి విడుదల చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. యుఎఫ్ఓలు లేవని, దాని ఉనికి కనిపించిందంటూ వచ్చిన వార్తలు గానీ, వీడియోలు గానీ సరైనవి కావంటూ ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన పెంటగాన్ అధికారులు హఠాత్తుగా వాటిని బహిర్గతం చేయడం వెనుక అమెరికా ఉద్దేశం ఏమై ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

English summary
The Pentagon has officially released three short videos showing "unidentified aerial phenomena" that had previously been released by a private company. The videos show what appear to be unidentified flying objects rapidly moving while recorded by infrared cameras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X