వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్ జెండర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హెల్సింకి: హర్మోన్ల చికిత్సతో పురుషుడిగా మారిన ఫిన్లాండ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బిడ్డ పుట్టిన సమయంలో సుమారు 4 కేజీల బరువుందని వైద్యులు ప్రకటించారు.

కుటుంబ గోప్యతను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని ఇంత కాలం పాటు రహస్యంగా ఉంచినట్టు ట్రాన్స్జెండర్ ప్రకటించారు. తన పేరును కూడ వెల్లడించలేదు. తనకు పుట్టిన బాబు పుట్టిన సమయంలో సుమారు 53 సెంటీమీటర్ల పొడవు ఉందని ప్రకటించింది.

In Finlands first, transgender man gives birth to healthy baby

ప్రస్తుతం 30 ఏళ్ళ వయస్సున్న ట్రాన్స్ జెండర్ 2015లో టెస్టోస్టెరాన్‌ థెరపీ ద్వారా మహిళ నుంచి పురుషుడిగా మారాడు. గర్భం దాల్చడానికి ముందే లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవాల్సి ఉంది. కానీ, దాన్ని వద్దనుకొన్నాడు.

ఫిన్లాండ్ చట్టం ప్రకారంగా హార్మోనల్‌ థెరపీ ద్వారా మహిళ నుంచి పురుషుడిగా మారాలనుకునే వ్యక్తి తాను పునరుత్పత్తి చేయలేని స్థితిలో ఉన్నట్టు నిరూపించుకోవాలి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకు ఇష్టమొచ్చినట్టు జీవనం సాగించే పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
A Finnish woman who underwent hormonal therapy has become the nation's first transgender man to give birth, local media said Wednesday, triggering controversy as laws require infertility to change gender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X