వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

298 మంది మృతి: మలేషియా జెట్ క్రాష్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్: రష్యా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్‌లో మలేషియా విమానం కూలిన సంఘటన యాదృచ్ఛికం కాదనే వాదన బలపడుతూ వస్తోంది. గురువారంనాడు మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 17 జైట్ లైనర్ కూలిపోయిన సంఘటనలో 298 మంది ప్రాణాలు గాలిలో కలిపోయాయి.

ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి బయలుదేరిన విమానం మార్గమధ్యంలో కూలిపోయి, అనంత విషాదాన్ని మిగిలించింది. మలేషియా విమానంలోని 15 మంది సిబ్బందిలో భారత సంతతికి చెందిన స్టీవార్డ్ ఉన్నాడు.

రష్యాను ఇతర దేశాలు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తిరుగుబాటుదారులు రష్యాకు చెందిన బుక్ క్షిపణితోనే విమానాన్ని పేల్చేవేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని ప్రపంచ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సంఘటనా స్థలంలో పొగలు

సంఘటనా స్థలంలో పొగలు

ఉక్రెయిన్‌లోని గ్రాబోవో గ్రామం వద్ద మలేషియా విమానం కూలిన ప్రదేశంలో దట్టమైన పొగలు ఎగజిమ్మాయి. బుక్ క్షిపణి పేల్చడం వల్లనే విమానం కూలినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఎగజిమ్మిన పొగలు

ఎగజిమ్మిన పొగలు

విమానం కూలిన ఉక్రెయిన్‌లోని ప్రదేశంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు.

సంఘటనా స్థలంలో ఇలా..

సంఘటనా స్థలంలో ఇలా..

ఉక్రెయిన్‌లోని గ్రాబోవో గ్రామం వద్ద విమానం కూలిన ప్రదేశంలో ఓ వ్యక్తి ఇలా కనిపించాడు. ఈ ప్రదేశం తిరుగుబాటుదార్ల చర్యలతో ఉద్రిక్తంగా ఉంటుంది.

శిథిలాల మీద నడుస్తూ...

శిథిలాల మీద నడుస్తూ...

కూలిన మలేషియా విమానం శిథిలాలపై నుంచి ఓ వ్యక్తి నడిచిపోతూ ఇలా కనిపించాడు. మలేషియా విమానం కూల్చివేత ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

డచ్ ఎంబసీ వద్ద మహిళ

డచ్ ఎంబసీ వద్ద మహిళ

పుతిన్ కిల్లర్ అనే ప్లకార్డును ప్రదర్శిస్తూ ఉక్రెయిన్ మహిళ డచ్ ఎంబసీ వద్ద ఇలా పడుకుంది. ఈ ప్రమాదంలో మరణించినవారిలో డచ్ దేశస్తులే ఎక్కువ మంది ఉన్నారు.

ప్రయాణికుడు బంధువు - మీడియా

ప్రయాణికుడు బంధువు - మీడియా

మలేషియా విమానంలో ప్రయాణించి మృత్యువాత పడిన ఓ ప్రయాణికుడి బంధువును మీడియా ప్రతినిధులు ఇలా చుట్టుముట్టారు.

మృతుల బంధువులు ఇలా..

మృతుల బంధువులు ఇలా..

విషాద సముద్రంలో మునిగిన మృతుల బంధువులు బస్సు ఎక్కడానికి ఇలా వెళ్తూ కనిపించారు. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు.

ఏడ్చేసిన మహిళ

ఏడ్చేసిన మహిళ

మలేషియా విమానం కూలి ప్రయాణికులు మృత్యువాత పడ్డారని తెలియడంతో ఓ మహిళ కౌలంలపూర్ విమానాశ్రయంలో కన్నీటి అదిమి పట్టుకుంటూ ఇలా..

లాస్ ఎంజెలెస్ నుంచి విమాం

లాస్ ఎంజెలెస్ నుంచి విమాం

అమెరికాలోని లాస్ ఎంజెలెస్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న మలేషియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానం. అదే విమానం గురువారంనాడు ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలంలపూర్‌కు బయలుదేరింది.

మలేషియా ఎయిర్‌లైన్స్ జెట్

మలేషియా ఎయిర్‌లైన్స్ జెట్

298 మంది ప్రయాణికులు, సిబ్బందితో కూడిన మలేషియా విమానం ఉక్రెయిన్‌లో కూలిపోయింది. ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి బయలుదేరిన విమానం నుంచి సంకేతాలు అందడం లేదని ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది.

English summary
The Kuala Lumpur-bound Malaysian Airlines MH 17 jetliner was shot down by Buk missile on Thursday when it was flying over Ukraine airspace near the Russian border, leaving all the 298 passengers and crew members on board dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X