వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్-చైనా ఆర్మీ మధ్య దూరం 500 మీటర్లే!: అదే డ్రాగన్ వశమైతే..

భారత్ - చైనా సరిహద్దల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరువైపుల ఆర్మీ మోహరించింది. గత నెలరోజులుగా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్/న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరువైపుల ఆర్మీ మోహరించింది. గత నెలరోజులుగా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

తగ్గకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: భారత్‌కు చైనా వార్నింగ్తగ్గకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: భారత్‌కు చైనా వార్నింగ్

డొక్లాం వద్ద గ‌త 30 రోజులుగా భార‌త్‌, చైనా సైనికుల మ‌ధ్య దూరం దాదాపు 500 మీట‌ర్లుగానే ఉంటోంది. ఒక‌రినొక‌రు 24 గంట‌ల పాటు గ‌మ‌నిస్తూనే ఉన్నారు.

చైనా దాడిలో 158మంది భారత జవాన్లు మృతి: ఇది పాక్ మీడియా పైత్యం చైనా దాడిలో 158మంది భారత జవాన్లు మృతి: ఇది పాక్ మీడియా పైత్యం

15 కిలో మీటర్ల దూరంలో..

15 కిలో మీటర్ల దూరంలో..

నాథులా క‌నుమ‌ నుంచి ఇది 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎప్పుడు ఏం జ‌రగ‌నుందో తెలియ‌క, ఒక స్థానంలో ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌రు చొప్పున‌ 24 గంటల పాటు గ‌స్తీ కాస్తున్నారు.

భారత్ ప్రయత్నాలు

భారత్ ప్రయత్నాలు

జూన్ 6 నుంచి కొన‌సాగుతున్న ఈ డోక్లాం వివాదం స‌ద్దుమ‌ణిగేలా చేయ‌డం కోసం భార‌త్ అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. బీజింగ్‌తో దౌత్య ఒప్పందం చేసుకునేందుకు యత్నిస్తోంది.

సరిహద్దు వద్ద చైనా ఆర్మీ, యుద్ధ నౌకలు

సరిహద్దు వద్ద చైనా ఆర్మీ, యుద్ధ నౌకలు

స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనా వైపు 3000ల మంది సైనిక ద‌ళం, వారి త‌ర్వాత యుద్ధ‌ నౌక‌లు ఉన్న‌ట్టు యూఏవీ (అన్‌మ్యాన్డ్ ఏరియ‌ల్ వెహిక‌ల్స్‌) స‌ర్వేలో తెలిసింది.

 జంపారీ పర్వత శ్రేణిపై చైనా కన్ను

జంపారీ పర్వత శ్రేణిపై చైనా కన్ను

దీన్ని బ‌ట్టి చూస్తే భార‌త్‌ను ఈశాన్య రాష్ట్రాల‌తో క‌లిపే ప్రాంతంలో ఉన్న జంపారీ ప‌ర్వ‌త‌శ్రేణిపై చైనా గురి ఉన్న‌ట్టుగా తెలుస్తోందని అంటున్నారు.

సిక్కిం చైనా వశమైతే..

సిక్కిం చైనా వశమైతే..

ఈ వివాదం గురించి పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌ను ప‌శ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లేవనెత్తనుంది. ఈ వివాదంలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది బెంగాలీలే అని, ఒక‌వేళ సిక్కిం గ‌న‌క చైనా వ‌శ‌మైతే, వారి త‌ర్వాతి గురి డార్జిలింగ్ పైనే ఉంటుందని, చైనా, నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్ దేశాల‌తో భార‌త దేశ అసంపూర్ణ దౌత్య విధానాల్లో బెంగాల్ బ‌లిప‌శువుగా మారుతోందని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. మరోవైపు, చైనా టిబెట్ స‌రిహ‌ద్దులో మిల‌ట‌రీ విన్యాసాలు ప్ర‌ద‌ర్శిస్తోంది.

మరో రెచ్చగొట్టే కథనం

మరో రెచ్చగొట్టే కథనం

చైనా మీడియా భారత్ పైన హద్దు మీరుతోంది. ఒక సిక్కింలోని డొక్లాంలోనే కాకుండా ఇప్పుడు మరిన్ని ప్రాంతాల విషయంలో రాద్దాంతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. డొక్లామ్ మాత్రమే కాకుండా నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాలను కూడా భారత్ భూభూగంగా చైనా గుర్తించబోదంటూ రెచ్చగొట్టే కథనాలు వెలువరించింది.

డొక్లామ్ మాత్రమే కాదంటూ..

డొక్లామ్ మాత్రమే కాదంటూ..

చైనా గ్లోబల్ టైమ్స్ అనే మీడియా సంస్థ తన కథనంలో చైనా కేవలం డొక్లామ్ భూమినే కాకుండా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఇతర భూభాగాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుందని, వాటిని భారత్ భూభాగంగా గుర్తించబోదని పేర్కొంది. అంతేకాదు, తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు యుద్ధానికి కూడా వెనుకాడబోమంటూ మరోసారి రెచ్చకొట్టేలా కథనం వెలువరించిన విషయం తెలిసిందే.

English summary
For the last 30 days at least, 350-odd Indian soldiers have been standing in a human chain, eyeball-to-eyeball with Chinese troops at Dokalam in Bhutan. Armed, but guns pointed down, the two lines of soldiers stand just metres apart. The lines stretch across 500-odd meters, in an area located roughly 15 km from the Nathu La pass.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X