వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పు కింద చెల్లింపుగా అమ్మాయిలు: దక్షిణ పాకిస్తాన్ లో దారుణం

తీసుకున్న అప్పు కింద చెల్లింపుగా అమ్మాయిలను తీసుకుంటున్న ఉదంతమిది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మిర్పూర్ ఖాస్: తీసుకున్న అప్పు కింద చెల్లింపుగా అమ్మాయిలను తీసుకుంటున్న ఉదంతమిది. గత కొన్నేళ్లుగా దక్షిణ పాకిస్తాన్ లో వేళ్ళూనుకుపోయిన ఈ వ్యవస్థ ఇప్పుడు తారస్థాయికి చేరింది. అప్పు తీసుకుని తిరిగి చెల్లించ లేని కుటుంబాల ఆడ పిల్లలను ఆప్పిచ్చిన వారు దౌర్జన్యంగా తమ బానిసలుగా చేసుకుంటున్నారు.

మరికొన్ని సందర్భాలలో కొంతమంది తల్లిదండ్రులే తీసుకున్న అప్పు తీర్చలేని పరిస్థితులలో అప్పిచ్చిన వారి ఒత్తిడికి తలొగ్గి తమ ఇంటి ఆడపిల్లలను వారి చేతుల్లో పెడుతున్నారు. ఇలా వస్తున్న అమ్మాయిలను కొంతమంది తమ రెండో భార్యగా చేసుకుంటుండగా, మరికొందరు వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.

In south Pak Hindu girls are snatched away for debt payment

అప్పు కింద వస్తున్న అమ్మాయిలను వివాహం చేసుకోవాలనుకున్న వారు వారిని ముస్లిం మతంలోకి మారుస్తున్నారు. దక్షిణ పాకిస్తాన్ అంతటా 20 లక్షల మందికి పైగానే అమ్మాయిలు ఇలా బానిసలుగా జీవనం గడుపుతున్నట్లు గ్లోబల్ స్లేవరీ ఇండక్స్-2016 పేర్కొంది.

సౌత్ ఏషియా పార్ట్ నర్ షిప్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఏటా వెయ్యికి పైగా క్రైస్తవ, హిందూ మతాలకు చెందిన అమ్మాయిలను ఇలా ఇస్లాం మతంలోకి మార్చుతున్నారు. ఈ విషయమై పోలీసులు, కోర్టులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఓ ఆడపిల్ల తండ్రి వాపోవడం గమనార్హం.

English summary
The women are like trophies to the men. They choose the prettiest, the young and pliable. Sometimes they take them as second wives to look after their homes. Sometimes they use them as prostitutes to earn money. Sometimes they take them simply because they can. An estimated 1,000 young Christian and Hindu girls, most of them underage and impoverished, are taken from their homes each year, converted to Islam and married, said a report by the South Asia Partnership organisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X