వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్, చైనా ఒకవైపు.. ప్రపంచం అంతా భారత్ వైపు.. కశ్మీర్‌పై ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు విజయం

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ మరో సెల్ఫ్ గోల్. అంతర్జాతీయంగా మరో దెబ్బ తగిలింది. అదే సమయంలో భారత్ కు మరో విజయం. మిత్రదేశం చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి కశ్మీర్‌ అంశాన్ని పాక్‌ తీసుకెళ్లగలిగింది. అధికారిక సమావేశాలు జరిగే టేబుల్‌ (హార్స్‌ షూ టేబుల్‌) వద్ద మాత్రం ఈ చర్చలు జరగలేదు. ఇష్టాగోష్ఠిగా రహస్య సంప్రదింపులు మాత్రం సాగాయు. ఈ క్రమంలో మండలి సభ్యదేశాలన్నింటి మద్దతు సాధించడంలో పాక్‌ విఫలమైంది.

పాక్‌ బాధను భుజాలకెత్తుకున్న చైనాకూ భంగపాటు ఎదురైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7-30 గంటల నుంచి 9 గంటల దాకా 15 సభ్యదేశాలూ ఈ అంశంపై ఇష్టాగోష్ఠిగా చర్చించాయి. భారత్‌, పాకిస్థాన్‌లు రెండూ ఈ సమావేశంలో నేరుగా పాల్గొనలేదు. పాక్‌కు తగిలిన మరో దెబ్బ ఏంటంటే.. ఈ సంప్రదింపులకు తమనూ అనుమతించాలని, నియమావళిలోని 37వ నిబంధన ప్రకారం.. తమను లోనికి రానివ్వాలని కోరినా ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న దేశం పోలెండ్‌ అందుకు తిరస్కరించింది.

 ఇష్టాగోష్టిగా చర్చలు..తేల్చిందేంటంటే..

ఇష్టాగోష్టిగా చర్చలు..తేల్చిందేంటంటే..

ఆర్టికల్‌ 370 కింద కశ్మీరుకు ఉన్న హోదా రద్దు, రాష్ట్ర విభజన తరువాత ఆ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు పాక్‌ చేసిన యత్నం ఫలించలేదు. మిత్రదేశం చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి కశ్మీర్‌ అంశాన్ని పాక్‌ తీసుకెళ్లగలిగింది. ఇష్టాగోష్ఠిగా రహస్య సంప్రదింపులు మాత్రం సాగాయి. ఇదే అంశంలో శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు అగ్రరాజ్యాల్లో అమెరికా ప్రత్యేకంగా ఎలాంటి వైఖరినీ ప్రకటించలేదు. సమావేశం జరగడానికి ఓ రెండుగంటల ముందు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫోన్‌ చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఫ్రాన్స్‌, రష్యా భారత నిర్ణయాన్ని సమర్ధించాయి. ముఖ్యంగా రష్యా భారత్‌కు పూర్తి బాసటగా నిలిచింది. కేవలం ఏం జరుగుతున్నదీ తెలుసుకొనేందుకు మాత్రమే ఈ సమావేశం తప్ప కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమన్నది సుస్పష్టం. మా వైఖరి ముందే చెప్పాం. ఆ రెండు దేశాలే దీనిని చర్చించి పరిష్కరించుకోవాలని రష్యా ప్రతినిధి దిమిత్రీ పోల్యాన్‌స్కీ తేల్చిచెప్పారు. ఆర్టిక్ 370ను రద్దు చేయటం వలన శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని, భారత్‌ను కట్టడి చేయాలని పాక్‌ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్‌ ఖురేషీ తాత్కాలిక సభ్యదేశాల విదేశాంగమంత్రులకు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి మరీ విజ్ఞప్తి చేశారు. శాశ్వత సభ్యదేశాల అధినేతలను సైతం కాంటాక్ట్‌ చేసినా ఆయనకు నిర్దిష్ట హామీ లభించలేదు.

ఫలించని పాక్ మంత్రాంగం...

ఫలించని పాక్ మంత్రాంగం...

భారత్ తీసుకున్న నిర్ణయం పైన అంతర్జాతీయంగా మద్దతు సాధించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారత్ నిర్ణయాన్ని తప్పు బట్టేందుకు సభ్య దేశాలు సిద్దంగా లేవనే విషయం స్పష్టమైంది. దీని కోసం పాక్ తమకున్న అన్ని మార్గాల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. ఉపఖండ శాంతిని దెబ్బతీస్తుందని పాక్ వాదించింది. ఈ మేరకు మండలికి ఈనెలలో అధ్యక్షత వహిస్తున్న పోలెండ్‌ ప్రతినిధి జోనా రోనెకాకు రాసిన లేఖలో పాక్‌ వాదించింది. ఈ లేఖను మండలి సభ్యదేశాల దృష్టికి చైనా తీసుకెళ్లింది. అయితే కశ్మీర్‌ వ్యవహారం భారత్‌, పాక్‌లు ద్వైపాక్షికంగా తేల్చుకోవాల్సిన అంశమని తాత్కాలిక సభ్యదేశాలు- బెల్జియం, కోట్‌ డివోయిర్‌, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వెటోరియల్‌ గినియా, జర్మనీ, ఇండొనేషియా, కువైట్‌, పెరూ, దక్షిణాఫ్రికా, పోలెండ్‌ దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనేక దేశాల ప్రతినిధులు సంప్రదింపులు జరిగే గదిలోకి వెళ్లేముందే తమ వైఖరిని వెల్లడించినట్లు సమితిలో భారత దౌత్యవర్గాలు వివరించాయి. కాగా, భద్రతామండలి రహస్య సమావేశాన్ని తమ విజయంగా పాక్‌ చెప్పుకొంటోంది. తాము కోరిన రీతిలో కేవలం 72 గంటల వ్యవధిలో ఈ సమావేశాన్ని మండలి ఏర్పాటు చేసిందని చెప్పుకుంటుంది. మరోవైపు- చైనా కూడా భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఏ దేశమూ ప్రత్యేకించి సమర్ధించలేదని స్పష్టం చేసింది.

మా అంతరంగిక విషయం : భారత్

మా అంతరంగిక విషయం : భారత్

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం పూర్తిగా భారత్ అంతరంగిక విషయమని...ఇందులో భారత్ వెలుపల ఎలాంటి చర్చలు ఉండవని భారత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. కశ్మీర్లో ఏదో ఉపద్రవం ముంచుకొస్తోందని పాక్‌ చేస్తున్న వాదన వాస్తవ విరుద్ధమని తేల్చి చెప్పారు. ఒకటొకటిగా అన్ని ఆంక్షలూ ఎత్తేసి పరిస్థితిని సాధారాణ స్థితికి తీసుకువస్తున్నాం. కశ్మీర్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా సకల జాగ్రత్తలూ తీసుకున్నామని ఆయన వివరించారు. చర్చలు ప్రారంభించాలంటే మొదట ఉగ్రవాదాన్ని ఆపండని పాక్‌కు అక్బరుద్దీన్‌ మరోమారు హితవు పలికారు. సుపరిపాలన, జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ల సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం మా చట్టసభలు ఈ నిర్ణయం తీసుకున్నాయని అక్బరుద్దీన్ తేల్చి చెప్పారు.

English summary
In UNSC meet Once Again India stated Kashmir internal matter. Pakistan misleading the world. Pak lost confidence of UNSC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X