వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ind Vs. Eng: ఇంగ్లండ్ జట్టుపై పట్టు బిగించిన భారత స్పిన్నర్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత క్రికెట్ జట్టు
Click here to see the BBC interactive

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజున స్పిన్నర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ భారత స్పిన్నర్ల ధాటికి వెంట వెంటనే వెనుతిరిగారు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ జట్టు 39 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ తరువాత 52 పరుగుల వద్ద అయిదో వికెట్ కోల్పోయింది. ఓలీ పోప్ కూడా 22 పరుగుల వద్ద ఔటవడంతో ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోరీ బర్న్స్ మూడో బంతికే పెవిలియన్ బాట పట్టాడు. ఇషాంత్ శర్మ చేతిలో ఔటయిన రోరీ ఒక్క పరుగు కూడా చేయలేదు. ఆ తరువాత డామినిక్ సిబ్లే 16 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచి ఇచ్చి వెనుతిరిగాడు.

దీనికి ముందు మ్యాచ్‌లో బాగా ఆడిన కెప్టెన్ జో రూట్ కూడా ఈసారి ఆరు పరుగులకే ఔటైపోయాడు. ఆ తరువాత అశ్విన్ బౌలింగ్‌లోనే డాన్ లారెన్స్ కూడా 9 పరుగులు చేసి నిష్క్రమించాడు. లంచ్ తరువాత బెన్ స్టోక్స్ కూడా 19 పరుగులకే అశ్విన్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

చెన్నై టెస్ట్

భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 329

రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత జట్టు ఎనిమిది ఓవర్లు ఆడి 329 పరుగులకు ఆలౌట్ అయింది. తొలిరోజు 6 వికెట్లకు 300 పరుగులు చేసిన భారత జట్టు మరో 29 పరుగులు మాత్రమే జోడించగలిగింది. రిషభ్ పంత్ 58 పరుగులు, అక్షర్ పటేల్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. రెండో రోజు అక్షర్ పటేల్ కొత్తగా పరుగులేమీ చేయకుండానే మోయిన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అదే ఓవర్లో ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ 96వ ఓవర్లో కులదీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ బాట పట్టారు. సిరాజ్ 4 పరుగులు చేయగా, యాదవ్ డకౌట్ అయ్యాడు.

ఇషాంత్ శర్మ

అంతకుముందు, ఆట తొలిరోజున టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో రోహిత్ శర్మ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. రోహిత్ తన టెస్ట్ కెరీర్లో మరో శతకాన్ని జోడించుకుని 161 పరుగులు చేశాడు. రహానే కూడా ధీటుగా ఆడి 67 పరుగులు చేశారు.

కాగా, ఫీల్డింగ్ జట్టు ఒక్క ఎక్‌స్ట్రా రన్ కూడా ఇవ్వకుండా 329 పరుగుల అత్యధిక టెస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ రికార్డ్ చేయడం ఈ మ్యాచ్ ప్రత్యేకతంగా నిలిచింది. అంతకుమందు, 1955లో లాహోర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ చేస్తూ 328 పరుగుల వరకు ఒక్క ఎక్‌స్ట్రా రన్ ఇవ్వలేదు. ఆ రికార్డును ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ బ్రేక్ చేసింది.

English summary
Ind Vs Eng: Indian spinners tighten their grip on the England team
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X