వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయనకు మోడీ వెరైటీ ఆహ్వానం, డచ్ పీఎం హిందీ ట్వీట్.. నెటిజన్ల కన్ఫ్యూజ్

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మూడు దేశాల్లో పర్యటించారు. అమెరికా నుంచి నెదర్లాండ్స్‌కు బయలుదేరుతుండగా ఉపాధ్యక్షులు మైక్‌పెన్స్‌ను మోడీ కాస్త వెరైటీగా భారత్‌కు ఆహ్వానించారట.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మూడు దేశాల్లో పర్యటించారు. అమెరికా నుంచి నెదర్లాండ్స్‌కు బయలుదేరుతుండగా ఉపాధ్యక్షులు మైక్‌పెన్స్‌ను మోడీ కాస్త వెరైటీగా భారత్‌కు ఆహ్వానించారట.

ఈ విషయాన్ని మైక్‌పెన్స్‌ 42వ భారత-అమెరికా బిజినెస్‌ సమిట్‌ కార్యక్రమంలో వెల్లడించారు. మైక్‌పెన్స్‌ ఒకప్పుడు ఇండియానా గవర్నర్‌గా పని చేశారు.

దీనిని ఉద్దేశిస్తూ 'ఇండియా..ఆనా' అని మోడీ మైక్‌తో అన్నారు. కానీ మైక్‌కి ఆ మాట అర్థం కాలేదు.

ఈ విషయాన్ని ఆయన మీటింగ్‌లో మైక్ పెన్స్ వెల్లడిస్తూ.. నేను ఒకప్పుడు ఇండియానా గవర్నర్‌గా పని చేశానని, ఇండియాలో పర్యటించిన తొలి ఇండియానా గవర్నర్‌ కావాలన్నది నా ఆశ అని మోడీతో చెప్పానని, అప్పుడు ఆయన ఇండియా ఆనా అన్నారని, ఆ తర్వాత ఇండియా ఆనా అంటే ఇండియాకి రమ్మని అర్థమని మోడీ చెప్పారని మైక్‌పెన్స్‌ పేర్కొన్నారు.

India ana: How PM Modi invited former Indiana governor Mike Pence to visit India

మోడీకి హిందీలో డచ్ పీఎం ట్వీట్.. నెటిజన్లు కన్ఫ్యూజ్

ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటనను ముగించుకొని బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. పోర్చుగల్‌, అమెరికా, నెదర్లాండ్స్‌లో పర్యటించారు. భారత్‌-డచ్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన పర్యటనలో డచ్‌ భాషలో పలుసార్లు ట్వీట్‌ చేశారు. దీనికి బదులుగా నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రుట్టే కూడా హిందీలో ట్వీట్‌ చేసి ఆశ్చర్యపరిచారు.

అయితే ఆయన చేసిన హిందీ ట్వీట్‌లో పదాల మధ్యలో ఎక్కడా స్పేస్‌లు లేకపోవడంతో నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు.

'నరేంద్ర మోడీకి స్వాగతం. మన ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. మన సమావేశం ఎంతో సంతోషాన్ని కలిగించింద'ని రుట్టే హిందీలో ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్‌ చదవడానికి చాలా కఠినంగా ఉందని, ఎక్కడా స్పేస్‌లు పెట్టకుండా రాశారని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

English summary
At a business summit in the US, a day after Prime Minister Narendra Modi left for Netherlands, Vice-President Mike Pence told the gathering that he has been invited to visit India. Speaking at the US-India Business Council’s 42nd Annual Leadership Summit, Pence said he shared a light moment with the prime minister when the later said “India ana (come visit India)”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X