వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ సహయం కోరిన భారత్,ఎందుకంటే?

ఇద్దరు మత గురువుల అదృశ్యంపై భారత అధికారులు తమ సహయం కోరారని పాకిస్తాన్ ప్రకటించింది.భారత ప్రభుత్వ అభ్యర్థనను అంతర్గత వ్యవహరాలశాఖకు పంపినట్టు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ బజారియా చెప్ప

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్:ఇద్దరు మత గురువుల అదృశ్యంపై భారత అధికారులు తమ సహయం కోరారని పాకిస్తాన్ ప్రకటించింది.భారత ప్రభుత్వ అభ్యర్థనను అంతర్గత వ్యవహరాలశాఖకు పంపినట్టు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ బజారియా చెప్పారు.

సయ్యద్ అసిఫ్ అలీ నిజామీ, ఆయన సోదరుడు నజీం అలీ నిజామీతో కలిసి ఈ ఏడాది మార్చి 8వ, తేదిన పాకిస్తాన్ కు వెళ్ళారు. లాహోర్ లోని హజరత్ దాతా దర్బార్ దర్గాలో చద్దర్ సమర్పించారు.

అక్కడి నుండి వారిద్దరూ కరాచీ వెళ్ళాల్సి వచ్చింది. అయితే లాహోర్ అధికారులు సరైన పత్రాలు లేవంటూ నజీంను ఆపేశారు. అయితే వారి గురించిన సమాచారం తెలియడం లేదు. ఈ విషయమై వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

India asks Pakistan to return two missing clerics

ఈ మత గురువుల ఆచూకీ కోసం భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి సయ్యద్ అసిఫ్ అలీ చెప్పారు.

ఐఎస్ఐ ఏజంట్లు వారిని రహస్యప్రదేశానికి తరలించారనే వదంతులు వచ్చాయి. పాకిస్తాన్ అధికారులతో మాట్లాడినట్టుగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వారాజ్ ప్రకటించారు.

లాహోర్ లోని దాతా దర్బార్ దర్గాతో పాటు భారత్ లోని నిజాముద్దీన్ ఔలియా దర్గాలు పరస్పరం కొన్ని సాంప్రదాయిక వస్తువులను ఇచ్చి పుచ్చుకొంటాయన్న విషయం తెలిసింది. మరో వైపు ఇస్లామిక్ జిహదీలు మత గురువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో వీరి అదృశ్యం భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

English summary
India has asked the Pakistan government to return two senior Indian clerics who have been missing from Lahore since Wednesday. Asif Nizami and his brother Nazim Nizami, senior clerics from Hazrat Nizamuddin Auliya dargah in New Delhi were travelling in Pakistan on a religious tour, but are believed to have gone missing from Lahore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X