వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కోసం కూడా: మిచెల్లీకి దుస్తులు డిజైన్‌చేసిన భారత డిజైనర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామాకు దుస్తులు రూపొందించిన ప్రముఖ డిజైనర్ బిభు మహాపాత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా దుస్తులు రూపొందించాలని ఉందని చెప్పారు. బిభు భారత దేశంలో పుట్టి అమెరికాలో ఫ్యాషన్ డిజైనర్‌గా స్థిరపడ్డారు.

బిభు మాట్లాడుతూ.. తాను రూపొందించిన దుస్తులను మిచెల్లీ ఒబామా ధరించడం గొప్ప అనుభూతి అని, అలాగే ప్రధాని మోడీకి కూడా దుస్తులు రూపొందించాలని ఉందని తెలిపారు. ఆ అవకాశం త్వరలో వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. డిజైనింగ్‌లో మిచెల్లీ అండ్ కో సహకారం మరువలేనిదని చెప్పారు.

 India-born designer Bibhu Mohapatra hopes to design for PM Modi soon

కాగా, అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా ఆదివారం ఢిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే. ఒబామా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ పర్యటనలో మిచెల్ ఒబామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఆమె ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

న్యూయార్క్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన డిజైనర్ బిభు మహాపాత్ర డిజైన్ చేసిన దుస్తులను ఆమె ధరించారు. జియోమెట్రిక్ - ప్రింట్ బ్లాక్, తెలుపు, నీలం రంగు కలయికతో... ఆకట్టుకునే విధంగా ఈ దుస్తులను రూపొందించారు. సెలబ్రిటీ మహిళలకు దుస్తులు రూపొందించడంలో బిభు మహాపాత్ర పేరుగా గాంచారు.

English summary
India-born designer Bibhu Mohapatra says he is "honoured" and "humbled" by US First Lady Michelle Obama wearing his creation on her trip to India and hopes he will get an opportunity to design for Prime Minister Narendra Modi soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X